IPL 2024: రూ. 13.25 కోట్ల ఆటగాడితో పాటు ఆరుగుర్ని వదిలేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పూర్తి జాబితా ఇదే!
SRH retained and released players list: ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరుగురు ఆటగాళ్లను వదిలేసుకుంది. ఊహించినట్లుగానే గత సీజన్ వేలంలో రూ. 13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఉద్వాసన పలికింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ఆటగాళ్లలో ముగ్గురేసి విదేశీ.. స్వదేశీ ఆటగాళ్లు ఉండటం విశేషం. హ్యారీ బ్రూక్‌తో పాటు ఇంగ్లండ్‌కే చెందిన ఆదిల్ రషీద్, వెస్టిండీస్ ప్లేయర్ అకీల్ హోస్సెన్‌లకు ఆరెంజ్ ఆర్మీ గుడ్‌బై చెప్పింది.

భారత ఆటగాళ్లలో సమర్థ్ వ్యాస్‌తో పాటు వివ్రాంత్ శర్మ, కార్తీక్ త్యాగీలను వదులుకుంది. భారత్‌కు చెందిన మయాంక్ అగర్వాల్‌కు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ గుడ్‌బై చెబుతుందని ప్రచారం జరిగినా.. అతనికి మరో అవకాశం ఇచ్చింది. మొత్తం 19 మంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది.
గత సీజన్‌లో భారీ అంచనాలు పెట్టుకున్న హ్యారీ బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. ఒకే ఒక్క మ్యాచ్‌లో శతకం బాదిన అతను మిగతా మ్యాచ్‌ల్లో చెత్త బ్యాటింగ్‌తో టీమ్ వైఫల్యానికి కారణమయ్యాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. గతంలో మాదిరి కాకుండా సన్‌రైజర్స్ ఈసారి చాలా తక్కువ మంది ఆటగాళ్లను వదిలేసింది.
అంతేకాకుండా ఆర్‌సీబీ నుంచి స్పిన్ ఆల్‌రౌండర్ షెహ్‌బాజ్ అహ్మద్‌ను ట్రేడింగ్ చేసుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్డ్ లిస్ట్:
అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూఖీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్డ్ లిస్ట్
హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగీ, వివ్రాంత్ శర్మ, అకీల్ హొస్సెన్, ఆదిల్ రషీద్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications