For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2024 షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 22 మ్యాచ్‌ల వివరాలను మాత్రమే అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమా ద్వారా వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

మార్చి 22న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వరకు జరిగే ఈ ఫస్టాఫ్ టోర్నీలో మొత్తం 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 4 డబుల్ హెడర్స్ ఉన్నాయి.

IPL 2024: Sunrisers Hyderabad match schedule for upcoming season

ఫస్టాఫ్ షెడ్యూల్‌లో హైదరాబాద్ వేదికగా రెండు మ్యాచ్‌లు మాత్రమే జరగనున్నాయి. మార్చి 23న ముంబైతో తొలి మ్యాచ్ జరగనుండగా.. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో మరో మ్యాచ్ జరగనుంది. ఈ ఫస్టాఫ్ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ మొత్తం 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు హోమ్ గ్రౌండ్‌లో మరో రెండు అవే గ్రౌండ్‌లో ఆడనుంది. ఈ ఫస్టాఫ్ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్.. కేకేఆర్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో తలపడనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 షెడ్యూల్

మ్యాచ్-1: మార్చి 23- కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా(రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-2: మార్చి 27- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్,హైదరాబాద్(రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-3: మార్చి 31- గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్, అహ్మదాబాద్(రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-4: ఏప్రిల్ 5- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్,హైదరాబాద్(రాత్రి 7.30 గంటలకు)

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా):
మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్/ఉపేంద్ర యాదవ్, ప్యాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్/షెహ్‌బాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:
అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్( రూ. 6.80 కోట్లు), వానిందు హసరంగా(రూ. 1.5 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ. 20.50 కోట్లు), జయదేవ్ ఉనాద్కత్(రూ. 1.60 కోట్లు), ఆకాశ్ సింగ్(రూ. 20 లక్షలు), జాథవెద్ సుబ్రమణ్యన్(రూ. 20 లక్షలు)

Story first published: Thursday, February 22, 2024, 18:59 [IST]
Other articles published on Feb 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+