Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: సునీల్ నరైన్ విధ్వంసం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ పదిలం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 273 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. సునీల్ నరైన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది.

సునీల్ నరైన్‌కు తోడుగా అంగ్‌క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆండ్రీ రస్సెల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41), రింకూ సింగ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా కేకేఆర్ చరిత్రకెక్కింది.

IPL 2024 Sunil Narine Raghuvanshi take Kolkata to second-highest total

ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 277 పరుగుల ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఈ రికార్డ్ అందుకుంది.

సునీల్ నరైన్ సునామీ..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు సునీల్ నరైన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్(18) విఫలమైనా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్‌లో వరుసగా 6, 6, 4,0, 6, 4 బాది 26 పరుగులు పిండుకున్నాడు.

సునీల్ నరైన్ ధాటికి కేకేఆర్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే నరైన్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ విధ్వంసానికి రఘు వంశీ కూడా తోడవ్వడంతో కేకేఆర్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన మూడో జట్టుగా రికార్డు అందుకుంది.

చెలరేగిన రస్సెల్..
25 బంతుల్లో రఘు వంశీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. సెంచరీ దిశగా సాగిన నరైన్‌ను మిచెల్ మార్ష్ ఔట్ చేశాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే అన్రిచ్ నోకియా బౌలింగ్‌లో రఘు వంశీ వెనుదిరగడంతో కేకేఆర్ పరుగుల వేగం తగ్గింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(18) విఫలమవ్వగా.. రింకూ సింగ్‌తో కలిసి ఆండ్రీ రస్సెల్(41) చెలరేగాడు.

ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అయితే రస్సెల్‌ను ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయగా.. రింకూ సింగ్(26)ను అన్రిచ్ నోకియా ఔట్ చేశాడు. చివరి ఓవర్‌లో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్ ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్‌ను అందుకోలేకపోయింది.

Story first published: Wednesday, April 3, 2024, 21:40 [IST]
Other articles published on Apr 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+