Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs SRH: ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 2 పరుగుల తేడాతో గెలుపొందింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ సమద్(12 బంతుల్లో5 ఫోర్లతో 25), ట్రావిస్ హెడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 21) ధాటిగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హర్షల్ పటేల్, సామ్ కరణ్ రెండేసి వికెట్లు తీసారు. రబడాకు ఓ వికెట్ దక్కింది.

SRH survive Ashutosh

శశాంక్ చెలరేగినా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులే చేసి ఓటమిపాలైంది. సామ్ కరణ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29), సికిందర్ రాజా(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28), శశాంక్ సింగ్(25 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 46 నాటౌట్), అషుతోష్ శర్మ(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 నాటౌట్) రాణించారు.

సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, టీ నటరాజన్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనాద్కత్ తలో వికెట్ తీసారు.

భువీ, కమిన్స్ శుభారంభం..
భారీ లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ప్యాట్ కమిన్స్ వేసిన రెండో ఓవర్‌లో జానీ బెయిర్ స్టో(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వరుస ఓవర్లలో ప్రభ్ సిమ్రాన్ సింగ్(4), శిఖర్ ధావన్(14)లను పెవిలియన్ చేర్చాడు. క్లాసెన్ స్టన్నింగ్స్ స్టంపౌట్‌తో ధావన్ ఔటయ్యాడు.

ఈ పరిస్థితుల్లో సామ్ కరణ్, సికిందర్ రాజా ఆచితూచి ఆడారు. క్రీజులో పాతుకుపోయిన సామ్ కరణ్‌ను నటరాజన్ ఔట్ చేయగా.. సికిందర్ రాజాను ఉనాద్కత్ పెవిలియన్ చేర్చాడు. ధాటిగా ఆడిన జితేశ్ శర్మను తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఔట్ చేయగా.. శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ ధాటిగా ఆడారు. దాంతో మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారింది.

భయపెట్టిన శశాంక్, అషుతోష్..
పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 39 పరుగులు అవసరమవ్వగా.. నటరాజన్ వేసిన 19వ ఓవర్‌లో అషుతోష్, నటరాజన్ చెరో బౌండరీ బాదడంతో 10 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరమవ్వగా.. ఉనాద్కత్ బౌలింగ్‌లో తొలి బంతినే అషుతోష్ శర్మ రెండు భారీ సిక్స్‌లు బాదాడు.

ఈ రెండు కూడా బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లుగా రాగా.. సన్‌రైజర్స్ ఆటగాళ్లు వదిలేసారు. చివరి 2 బంతుల్లో 11 పరుగులు అవసరమవ్వగా.. ఉనాద్కత్ 9 పరుగులే ఇచ్చి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓవర్‌లో మొత్తం మూడు క్యాచ్‌లు నేలపాలయ్యాయి.

Story first published: Tuesday, April 9, 2024, 23:24 [IST]
Other articles published on Apr 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+