Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: హసరంగా ఔట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి ముంబై ఇండియన్స్ స్పిన్నర్!

ఐపీఎల్ 2024 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా దూరమయ్యాడు. ఎడమ మడమ నొప్పితో బాధపడుతున్న అతను ఈ సీజన్ ఆడే అవకాశాలు లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆటగాడితో హసరంగా స్థానాన్ని భర్తీ చేసింది. శ్రీలంకకే చెందిన మణికట్టు స్పిన్నర్ విజయ్‌కాంత్ వియస్కాంత్‌ను సన్‌రైజర్స్ తీసుకుంది.

ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం విజయ్‌కాంత్‌ను అతని కనీస ధర రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్రకటించింది. తమిళనాడు మూలాలు ఉన్న 22 ఏళ్ల విజయ్‌కాంత్ ఇప్పటి వరకు ఫ్రాంచైజీ క్రికెట్‌లో 33 టీ20లు ఆడి 42 వికెట్లు తీసాడు.

IPL 2024 SRH Replaces Injured Wanindu Hasaranga With Vijayakanth Viyaskanth

హాంగ్జ్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో విజయ్‌కాంత్ శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐఎల్ టీ20లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన విజయ్‌కాంత్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక దేశవాళీ క్రికెట్‌లో తమిళ్ యూనియన్ తరఫున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు తీసాడు.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌కు ఆడిన విజయ్‌కాంత్.. లంక ప్రీమియర్ లీగ్ జఫ్నా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఎల్‌పీఎల్ 2023 సీజన్‌లో 6.88 ఎకానమీతో 13 వికెట్లు తీసాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో విజయ్‌కాంత్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నెట్‌బౌలర్‌గా సేవలందించాడు.

అయితే ముత్తయ్య మురళీదరణ్ చొరవతో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. సెకండాఫ్ సీజన్ వరకు అయినా హసరంగా అందుబాటులోకి వస్తాడని సన్‌రైజర్స్ భావించింది. కానీ అతను దీర్ఘకాలంగా వేధిస్తున్న ఎడమ మడమ నొప్పితో బాధపడుతుండటంతో శ్రీలంక బోర్డు.. ఐపీఎల్‌ 2024 సీజన్ నుంచి తప్పుకోవాలని సూచించింది.

టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో హసరంగాకు ఐపీఎల్ ఆడేందుకు అనుమతించడం లేదని శ్రీలంక బోర్డు.. బీసీసీఐకి సమాచారమిచ్చింది. ఇక ఐపీఎల్ 2024 వేలంలో హసరంగాను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేసింది.

Story first published: Tuesday, April 9, 2024, 20:33 [IST]
Other articles published on Apr 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+