సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్.. టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పలు రికార్డులను నమోదు చేసింది.
1.అత్యధిక సిక్స్‌లు..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 22 సిక్స్‌లు బాదింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో ఇన్ని సిక్స్‌లు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ పేరిట ఉన్న రికార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్ అధిగమించింది. 2013లో పుణేవారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 21 సిక్స్‌లు బాదింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అధిగమించింది.
22 సిక్స్‌లు - సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ - 2024
21 సిక్స్‌లు - ఆర్‌సీబీ వర్సెస్ పీడబ్ల్యూఐ - 2013
20 సిక్స్‌లు - ఆర్‌సీబీ vs గుజరాత్ లయన్స్ - 2016
20 సిక్స్‌లు - ఢిల్లీ డేర్‌డెవిల్స్ vs గుజరాత్ లయన్స్ - 2017
20 సిక్స్‌లు - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - 2024