Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kavya Maran Deepfake video: మార్క్‌రమ్‌కు ముద్దు పెట్టిన కావ్య పాప!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట కంటే కావ్య మారన్‌ను చూసేందుకే మైదానాలకు వెళ్లే ఫ్యాన్స్ ఉన్నారు. సినీ హీరోయిన్ తలపించే ఆమె అందానికి పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు.

ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్‌మన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత పాపులారిటీ ఆమె సొంతం. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతాయి.

IPL 2024 SRH Owner Kavya Maran Deepfake Video Goes Viral

డీప్ ఫేక్ వీడియో..
ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌లకు హాజరవుతూ.. కావ్య మారన్ సందడి చేస్తోంది. అయితే కావ్య మారన్‌కు సంబంధించి ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌కు కావ్య మారన్ కిస్ పెట్టినట్లు క్రియేట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.

మార్క్‌రమ్‌తో లిప్ లాక్..
ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం కావ్య మారన్‌ను మార్క్‌రమ్ అమాంతం ఎత్తుకొని లిప్ లాక్ ఇచ్చాడని కొందరు ఆకతాయిలు డీప్ ఫేక్ వీడియోను రూపొందించారు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టుకు ఎయిడెన్ మార్క్‌రమ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.

ఆ టోర్నీలో సన్‌రైజర్స్ వరుసగా రెండు సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. సెకండ్ సీజన్‌ విజయానంతరం మార్క్‌రమ్ సతీమణి నికోల్ మార్క్‌రమ్‌‌ను అతను ఎత్తుకొని కిస్ ఇచ్చాడు. ఈ వీడియోనే కావ్య మారన్‌గా మార్చి వైరల్ చేస్తున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు.

సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫైర్
తమ అభిమాన టీమ్ ఓనర్‌పై ఇలాంటి చెత్త వీడియోలు చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల సెలెబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. సౌత్ హీరోయిన్ రష్మిక మందానపై రూపొందించిన డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వీడియోను రూపొందించిన ఆకతాయిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది. మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్‌తో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

Story first published: Tuesday, April 9, 2024, 17:00 [IST]
Other articles published on Apr 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+