Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: సన్‌రైజర్స్ నయా కోచ్ సంచలన నిర్ణయం.. ఆ ఆటగాళ్ల‌కు గుడ్‌బై!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రక్షాళనకు నడుం బిగించింది. ముందుగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేసి న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెటోరిని నియమించుకుంది. గత సోమవారమే ఈ ప్రకటన వెలువడగా.. వెటోరి సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా తన పనిని మొదలుపెట్టాడు. జట్టు బలహీనతలు, బలాలపై ఫోకస్ పెట్టాడు.

అలాగే తనకు అనుకూలంగా ఉండే సపోర్ట్ స్టాఫ్‌ను తెచ్చుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్, ఫీల్డింగ్ కోచ్ హేమంగ్ బదానీ, స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీదరణ్‌లను తప్పించేందుకు కూడా ప్రణాళికలను సిద్దం చేస్తున్నాడు. తనకు అసిస్టెంట్ కోచ్‌లుగా న్యూజిలాండ్‌కు చెందిన మాజీ ఆటగాళ్లతో పాటు ఇతర ఫ్రాంచైజీల్లో తనతో కలిసి పని చేసిన వారిని నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Daniel Vettori

అలాగే టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు పేపర్ వర్క్ సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్ల ఫామ్, రికార్డ్స్, అనుభవాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లతో ఓ జాబితాను సిద్దం చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుండటంతో తన పనిని వేగవంతం చేశాడు.

టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్ కూడా చాలా ముందుగా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వదులుకునే ఆటగాళ్ల జాబితాను డానియల్ వెటోరీ రూపొందిస్తున్నాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగి అట్టర్ ఫ్లాఫ్ అయిన హ్యారీ బ్రూక్‌తో పాటు ఫజలక్ ఫరూకీ, అకీల హోస్సెన్, గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్‌లకు గుడ్‌బై చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కోసం సన్‌రైజర్స్ రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టగా.. అతను 11 మ్యాచ్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఇక ఇందులో ఓ సెంచరీ ఉండటం విశేషం. మూడు ఇన్నింగ్స్‌ల్లో డకౌటైన హ్యారీ బ్రూక్.. 6 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు.

టెస్ట్ ప్లేయర్ అయిన హ్యారీ బ్రూక్‌కు ఇంత డబ్బు అవసరం లేదని వెటోరి భావిస్తున్నాడు. రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసిన మయాంక్ అగర్వాల్‌ను కూడా వెటోరి నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో మయాంక్ అగర్వాల్ రాణిస్తుండటంతో అతని విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

Story first published: Thursday, August 10, 2023, 17:44 [IST]
Other articles published on Aug 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+