IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సాధించింది. అంతేకాకుండా పవర్ ప్లేలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఈ ఫీట్ సాధించింది.
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 46) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్. టీ20 క్రికెట్ చరిత్రలో కూడా పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.

పవర్ ప్లేలోని 36 బంతుల్లో 6 బాల్సే డాట్ అవ్వగా.. సన్‌రైజర్స్ బ్యాటర్లు 11 సిక్స్‌లు, 13 ఫోర్లు కొట్టారు. 2017లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్‌గా ఉండగా.. సన్‌రైజర్స్ 125/0 స్కోర్‌తో అధిగమించింది.
ఐపీఎల్‌లో అత్యధిక పవర్ ప్లే స్కోర్లు
125/0 - ఎస్‌ఆర్‌హెచ్ vs డీసీ, 2024*
105/0 - కేకేఆర్ vs ఆర్‌సీబీ, 2017
100/2 - సీఎస్‌కే vs పంజాబ్ కింగ్స్, 2014
90/0 - సీఎస్‌కే vs ముంబై, 2015
88/1 - కేకేఆర్ vs డీసీ, 2024*
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ టీమ్ 100
5 ఓవర్లు - ఎస్‌ఆర్‌హెచ్ vs డీసీ, ఢిల్లీ, 2024
6 ఓవర్లు - సీఎస్‌కే vs పంజాబ్, ముంబై, 2014
6 ఓవర్లు - కేకేఆర్ vs ఆర్‌సీబీ, బెంగళూరు, 2017
6.5 ఓవర్లు - సీఎస్‌కే vs ముంబై, ముంబై, 2015
7 ఓవర్లు - ఎస్‌ఆర్‌హెచ్ vs ముంబై, హైదరాబాద్, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications