For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి కేన్ మామ!

హైదరాబాద్: ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే టీమ్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ముందుగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేసింది. కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెటోరిని నియమించుకుంది. జట్టులో మరిన్ని మార్పులు చేసేందుకు సిద్దమవుతోంది.

ఈ ఏడాది డిసెంబర్‌లోనే మినీ వేలం జరగనుండటంతో జట్టు బలోపేతం కోసం ప్రణాళికను రచిస్తోంది. సపోర్ట్ స్టాఫ్‌తో పాటు జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కోచ్‌గా బాధ్యతలను స్వీకరించిన డానియల్ వెటోరి.. ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం బ్లూ ప్రింట్ సిద్దం చేస్తున్నాడు.

IPL 2024: SRH can target Kane Williamson for upcoming Season

జట్టులో ఉన్న ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్నాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున వారు రాణించిన తీరుతో పాటు వివిధ టోర్నీల్లో ఎలా ఆడుతున్నారనే గణంకాలను నమోదు చేస్తున్నాడు. జట్టు బలహీనతలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన డానియల్ వెటోరి.. వాటిని అధిగమించడానికి చేయాల్సిన పనులపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాడు.

ఈ క్రమంలోనే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 2022 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన కేన్ మామను.. గత సీజన్‌కు ముందు కావ్య పాప వదులుకొంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్టు వైఫల్యానికి అతన్ని కారణంగా భావించి వేటు వేసింది.

ఐపీఎల్ 2023 మినీ వేలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా తీసుకోలేదు. దాంతో గుజరాత్ టైటాన్స్ కేన్ విలియమ్సన్‌ను రూ.2 కోట్ల కనీస ధరకే కొనుగోలు చేసింది. దురదృష్టవశాత్తు అతను తొలి మ్యాచ్‌లోనే బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కాలు విరగడంతో ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు.

ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్న కేన్ విలియమ్సన్ భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఒకవేళ అతను రీఎంట్రీ ఇచ్చి వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేయవచ్చు. కుదిరితే ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్‌ నుంచి తీసుకోవచ్చు. ఒక వేళ వేలంలోకి వస్తే భారీ ధరను చెల్లించి తీసుకోవచ్చు. కేన్ మామ లాంటి అనుభవం కలిగిన బ్యాటర్ సన్‌రైజర్స్‌కు చాలా అవసరం.

Story first published: Saturday, August 19, 2023, 18:37 [IST]
Other articles published on Aug 19, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+