For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs PBKS: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే సింగిల్ ఎడిషన్ టోర్నీలో 160 సిక్స్‌లు బాదిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రికార్డును అధిగమించింది. 157 సిక్స్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆర్‌సీబీని సన్‌రైజర్స్ హైదరాబాద్ వెనక్కి నెట్టింది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 14 సిక్స్‌లు బాదిన సన్‌రైజర్స్ ఓవరాల్‌గా 160 సిక్స్‌ల మార్క్‌ను అందుకుంది. అభిషేక్ శర్మ 6 సిక్స్‌లు బాదగా.. రాహుల్ త్రిపాఠి రెండు, నితీష్ కుమార్ రెడ్డి మూడు, హెన్రీచ్ క్లాసెన్ రెండు, అబ్దుల్ సమద్ ఓ సిక్సర్ కొట్టారు.

IPL 2024 SRH become first team with 160 sixes in a t20 competition

ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్(160) తర్వాత ఆర్‌సీబీ(157), సీఎస్‌కే(145-ఐపీఎల్ 2018), సర్రే టీమ్(144- టీ20 బ్లాస్ట్ 2023), కేకేఆర్(143-కేకేఆర్(ఐపీఎల్ 2019) జట్లు వరుసగా కొనసాగుతున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. తాజా సీజన్‌లో అతను 41 సిక్స్‌లు బాదాడు. హెన్రీచ్ క్లాసెన్ 33 సిక్స్‌లు కొట్టగా.. డేవిడ్ వార్నర్(ఐపీఎల్ 2016), ట్రావిస్ హెడ్ 31 సిక్స్‌లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ రన్స్ చేసిన జట్టుగానూ సన్‌రైజర్స్ గుర్తింపు పొందింది. ఈ సీజన్‌లో మొత్తం 6 సార్లు 200 ప్లస్ రన్స్ చేసిన సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్(2023), కేకేఆర్, ఆర్‌సీబీ సరసన నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. అథర్వ టైడ్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), రిలీ రోసౌ(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49) తృటిలో అర్థ శతకాలు చేజార్చుకున్నారు.

చివర్లో జితేశ్ శర్మ(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టీ నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, విజయ్‌కాంత్ వియాస్కంత్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66), హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 ) సత్తా చాటారు. రాహుల్ త్రిపాఠి(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), నితీష్ కుమార్ రెడ్డి(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Sunday, May 19, 2024, 19:56 [IST]
Other articles published on May 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+