ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా తమ ప్రాక్టీస్ క్యాంప్‌ను షురూ చేసింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లంతా ఈ క్యాంప్‌లో పాల్గొనగా.. టోర్నీ ప్రారంభానికి ముందు కీలక ఆటగాళ్లంతా జట్టుతో కలవనున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది.
టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆరెంజ్ ఆర్మీ.. ఇప్పటికే జట్టును ప్రక్షాళన చేసింది. కోచ్‌తో పాటు కెప్టెన్‌ను మార్చింది. బ్రియాన్ లారాపై వేటు వేసి డానియల్ వెటోరిని తమ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్‌రమ్ స్థానంలో వరల్డ్ కప్ విన్నింగ్ సారథి ప్యాట్ కమిన్స్‌ను నియమించింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో జట్టు బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసిన సన్‌రైజర్స్.. ప్యాట్ కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్‌లను కొనుగోలు చేసింది.

కానీ ఎప్పటిలానే విదేశీ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. టోర్నీ రూల్స్ ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్ల కంటే ఎక్కువ ఆడే అవకాశం లేదు. దాంతో సన్‌రైజర్స్ ఎవరికి అవకాశం ఇస్తుందోననేది ఆసక్తికరంగా మారింది. వేలంలో కొనుగోలు చేసిన ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్‌లకు అధిక ప్రాధాన్యత దక్కనుంది.
ఓవర్‌సీ కోటాలో ఈ ఇద్దరు బరిలోకి దిగడం ఖాయం. ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. లోయరార్డర్ బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా.. పేసర్‌గా ప్యాట్ కమిన్స్ తుది జట్టులో కొనసాగుతాడు. గాయాలైతే తప్పా.. ఈ ఇద్దరూ ప్రతీ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. వికెట్ కీపర్‌గా హెన్రీచ్ క్లాసెన్ తుది జట్టులో ఉండటం ఖాయం. అతని విధ్వంసకర బ్యాటింగ్ కూడా జట్టుకు కలిసి రానుంది.
పార్ట్‌టైమ్ బౌలర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తుది జట్టులో కొనసాగనున్నాడు. దాంతో గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, వానిందు హసరంగా, ఫజలక్ ఫరూఖీలకు నిరాశే ఎదురవ్వనుంది. మార్క్‌రమ్, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్‌లో ఏ ఒక్కరు తుది జట్టులో ఆడే పరిస్థితి లేకుంటే గ్లేన్ ఫిలిప్స్ బరిలోకి దిగుతాడు.
అతను టోర్నీ ఆసాంతం బ్యాకప్ ప్లేయర్‌గా కొనసాగే అవకాశం ఉంది. కమిన్స్‌కు బ్యాకప్‌గా మార్కో జాన్సెన్ ఆడవచ్చు. హసరంగా, ఫజలక్ ఫరూఖీకి మాత్రం తుది జట్టులో చోటు కష్టమే. మార్క్‌రమ్ విఫలమైతే.. ఫిలిప్స్‌కు అవకాశం దక్కుతుంది. అతను కీపింగ్, బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. అన్నింటి కంటే అతను సూపర్ ఫీల్డర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్/ఉపేంద్ర యాదవ్, ప్యాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్/షెహ్‌బాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్
సన్‌రైజర్స్ పూర్తి జట్టు..
అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్( రూ. 6.80 కోట్లు), వానిందు హసరంగా(రూ. 1.5 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ. 20.50 కోట్లు), జయదేవ్ ఉనాద్కత్(రూ. 1.60 కోట్లు), ఆకాశ్ సింగ్(రూ. 20 లక్షలు), జాథవెద్ సుబ్రమణ్యన్(రూ. 20 లక్షలు)