Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: కేకేఆర్‌‌కు బిగ్ షాక్.. సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్ !

ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రేయస్ అయ్యర్.. తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

విదర్భతో జరగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో తృటిలో శతకాన్ని చేజార్చుకున్న శ్రేయస్ అయ్యర్.. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్‌కు రాలేదు. అతని వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత తెలుసుకునేందుకు అయ్యర్‌‌కు స్కానింగ్ చేయించినట్లు సమాచారం.

IPL 2024 Shreyas Iyer likely to miss initial IPL matches due to Injury

ఇక అయ్యర్ గాయం తిరగబెట్టిందని ముంబై రంజీ జట్టుకు చెందిన ఓ అధికారి తెలిపాడు. 'శ్రేయస్ అయ్యర్ సౌకర్యవంతంగా కనిపించడం లేదు. అతనికి మళ్లీ వెన్ను గాయం తిరగబెట్టింది. రంజీ ట్రోఫీ ఫైనల్ చివరి రోజు కూడా అతను ఫీల్డింగ్ చేసే అవకాశం లేదు. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది.'అని సదరు అధికారి ఒకరు మీడియాతో అన్నారు.

గతంలో అయ్యర్‌ వెన్నుకు శస్త్ర చికిత్స జరిగింది. ఈ గాయం కారణంగా అతను సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరమయ్యాడు. పదే పదే గాయపడటం అయ్యర్‌కు అలవాటుగా మారింది. గాయం కారణంగానే అతను గత ఐపీఎల్ సీజన్‌ కూడా ఆడలేదు. గాయాల నుంచి రక్షించుకునేందుకే అతను రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. కానీ బీసీసీఐ నుంచి ఒత్తిడి రావడంతో ఫైనల్ మ్యాచ్ బరిలో నిలిచి మళ్లీ గాయపడ్డాడు.

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుండగా.. మార్చి 23న కొల్‌కతా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో కేకేఆర్ తమ క్యాంపైన్‌ను మొదలుపెట్టనుంది. ఒకవేళ అయ్యర్ దూరమైతే.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది.

Story first published: Thursday, March 14, 2024, 10:21 [IST]
Other articles published on Mar 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+