Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: అందుకే ఆ ఇద్దరిని పక్కనపెట్టాం: సంజూ శాంసన్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ పిచ్ ఛేజింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసినా మేం రాణించగలం. జట్టులోని వాతావరణం చాలా బాగుంది. అసాధారణమైన ఆటగాళ్లు ఉన్నారు. మా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ధ్రువ్ జురెల్‌తో పాటు షిమ్రాన్ హెట్‌మైర్ దూరమయ్యారు. వారి స్థానాల్లో శుభమ్ దుబే, డోనోవన్ ఫెరెయిరా జట్టులోకి వచ్చారు.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

IPL 2024 Sanju Samson says Dhruv Jurel and Hetmyer are unavailable in DC vs RR Match

ఇక ఈ సీజన్‌లో పిచ్‌లు అన్నీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ అన్నాడు. 'పిచ్‌లు అన్నీ బ్యాటింగ్‌‌కు అనుకూలంగా ఉన్నాయి. మా జట్టులోని కొందరు ఆటగాళ్లు గాయాలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వాటిని మేం పెద్దగా పట్టించుకోవడం లేదు. మ్యాచ్‌లు గెలవడంపైనే దృష్టి సారించాం. ఇషాంత్, గుల్బాదిన్ జట్టులోకి వచ్చారు.'అని రిషభ్ పంత్ తెలిపాడు.

తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రెజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నైబ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెర్రెయిరా, రోవ్‌మన్ పోవెల్, శుభమ్ దుబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Story first published: Tuesday, May 7, 2024, 19:33 [IST]
Other articles published on May 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+