Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RR: ధోనీ మార్క్ వికెట్ కీపింగ్... సంజూ శాంసన్ స్టన్నింగ్ రనౌట్! (వీడియో)

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కళ్లు చెదిరే రనౌట్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ శాంసన్.. వెటరన్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మార్క్ వికెట్ కీపింగ్‌‌తో ఆకట్టుకున్నాడు.

అచ్చం ధోనీ స్టైల్‌లోనే నోలుక్ రనౌట్‌తో అందర్నీ ఆశ్చర్య పరిచాడు. సంజూ శాంసన్ స్టన్నింగ్ రనౌట్‌కు పంజాబ్ కింగ్స్ డేంజరస్ బ్యాటర్ లియామ్ లివింగ్‌ స్టోన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IPL 2024 Sanju Samson Replicates MS Dhoni Behind the Stumps to Run Out Liam Livingstone

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్ వేసిన 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని పుల్ టాస్‌గా వేయగా.. అషుతోష్ శర్మ డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. లివింగ్ స్టోన్ క్విక్ డబుల్‌కు ప్రయత్నించగా.. ఫీల్డర్ బంతిని అందుకోవడం చూసిన అషుతోష్ శర్మ నిరాకరించాడు.

దాంతో హాఫ్ పిచ్ వరకు వచ్చిన లివింగ్ స్టోన్ యూటర్న్ తీసుకోగా.. తనూష్ కోటియన్ త్రోను అద్భుతంగా అందుకున్న సంజూ శాంసన్.. ధోనీ తరహాలో బంతిని వికెట్లవైపు విసిరేసాడు. కనీసం చూడకుండా బంతిని వికెట్లను హిట్ చేశాడు. లివింగ్ స్టోన్.. క్రీజు బయటే ఉండటంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది.

సంజూ శాంసన్ స్టన్నింగ్ రనౌట్‌‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరో ధోనీ అంటూ కితాబిస్తున్నారు. ఈ రనౌట్ పంజాబ్ కింగ్స్ కొంపముంచింది. అప్పటికే దూకుడుగా ఆడిన లివింగ్ స్టోన్ కాసేపు క్రీజులో ఉంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడేవాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులే చేసింది. జితేశ్ శర్మ(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29), అషుతోష్ శర్మ(16 బంతుల్లోఫోర్, 3 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, April 13, 2024, 22:01 [IST]
Other articles published on Apr 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+