Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: అప్పుడు ధోనీ.. ఇప్పుడు కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకా అహంకారానికి బలి!

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తయ్యింది. ముందుగా బ్యాటింగ్‌లో తడబడిన లక్నో సూపర్ జెయింట్స్.. అనంతరం బౌలింగ్‌లో తేలిపోయింది.

166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంకర బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే ఈ ఘోర పరాజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు హాజరైన అతను.. ఈ ఓటమిని తట్టుకోలేకపోయాడు.

IPL 2024 Sanjiv Goenka s anger reignites memories of removing Dhoni as RPS captain

రాహుల్‌కు క్లాస్ పీకిన సంజీవ్..
మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్‌తో సంజీవ్ గోయెంకా సీరియస్‌గా చర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బాధ్యుడిని చేస్తూ గోయెంకా క్లాస్ పీకినట్లు ఈ వీడియోను చూస్తే అర్థమవుతోంది.

మ్యాచ్ పరిస్థితిని కేఎల్ రాహుల్ చెప్పే ప్రయత్నం చేసినా సంజీవ్ గోయెంకా వినిపించుకోలేదు. కోపంతో ఊగిపోయారు. వారి మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత లేనప్పటికీ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

ధోనీకి కూడా అవమానం..
తమ కెప్టెన్‌‌ను మందలించడం సంజీవ్ గోయెంకాకు ఇదే తొలిసారి కాదు. గతంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా సంజీవ్ గోయెంకా ఇదే రీతిలో అవమానించాడు. 2016 సీజన్‌లో ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌ పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.

దాంతో టీమ్ ఓటములకు బాధ్యుడిని చేస్తూ ధోనీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి స్టీవ్ స్మిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. అంతటితో ఆగకుండా ధోనీ ఫిట్‌నెస్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాంతో ధోనీ, ఆర్‌ఎస్‌పీ మేనేజ్‌మెంట్‌కు గొడవ జరుగుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ధోనీ సతీమణి సైతం తన భర్తకు మద్దతుగా సంజీవ్ గోయెంకాకు వ్యతిరేకంగా అప్పట్లో పోస్ట్‌లు పెట్టింది.

Story first published: Thursday, May 9, 2024, 10:29 [IST]
Other articles published on May 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+