తాము ఊహించినదానికంటే పిచ్ చాలా నెమ్మదిగా ఉందని, దాంతోనే ఓటమిపాలయ్యామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పేలవ బ్యాటింగ్‌తో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సామ్ కరణ్.. బ్యాటింగ్ వైఫల్యమే తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'మేం అద్భుతంగా బౌలింగ్ చేశామని భావించాం. ముఖ్యంగా రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఫీలయ్యాం.

కానీ దురదృష్టవశాత్తు విజయాన్ని అందుకోలేకపోయాం. మేం ఊహించిన దానికంటే వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. మేం పేస్, బౌన్స్‌ను ఆశించాం. కానీ అలా జరగలేదు. తదుపరి మ్యాచ్‌కు మాకు విశ్రాంతి ఉంది. ఆర్‌సీబీతో జరిగే ఆ మ్యాచ్‌కు అన్ని విధాలుగా సిద్దమవుతాం.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) టాప్ స్కోరర్. రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో, 4 ఫోర్లు, సిక్స్‌తో 32), డారిల్ మిచెల్ (19 బంతుల్లో, 2 ఫోర్లు, సిక్స్‌తో 30) కీలక పరుగులు సాధించారు.
శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24)తలో మూడు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసి ఓటమిపాలైంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), శశాంక్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా (3/20) మూడు, సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్‌పాండే (2/35) చెరో రెండు వికెట్లు తీశారు.