IPL 2024: అందుకే శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోలేదు: రుతురాజ్ గైక్వాడ్
పీఎల్ 2024 సీజన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నా. సీఎస్‌కే జట్టుతో ఆడిన తర్వాత నేను ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. చెన్నై అభిమానులను మళ్లీ చూసినందుకు సంతోషంగా ఉంది. కానీ నేను ఇప్పుడు ఆర్‌సీబీతో ఉన్నాను. మా జట్టు కూడా సీఎస్‌కేలా ఓ మంచి టీమ్‌లా మారుతుందని ఆశిస్తున్నా.

ఈ సీజన్ కోసం బాగా సన్నదమయ్యాం. మా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. బ్యాకప్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. గతంలో కంటే మా జట్టు చాలా మెరుగ్గా ఉంది. గాయాలు మా ప్రణాళికలను దెబ్బతీయవని భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో అల్జారీ జోసెఫ్ ఓవర్‌సీస్ బౌలర్‌గా బరిలోకి దిగుతున్నాడు. మిడిలార్డర్‌లో స్పిన్నర్లను తీసుకున్నాం.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నాని ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మరొకరిపై ఆధారపడకుండా కెప్టెన్‌గా తన మార్క్ చూపించాలనుకుంటున్నానని చెప్పాడు. 'గత వారమే కెప్టెన్సీ నియామకం గురించి తెలిసింది. కానీ గతేడాదే ధోనీ భాయ్ హింట్ ఇచ్చాడు. జట్టులో ప్రతీ ఒక్కరు అనుభవజ్ఞులే.
కానీ మేం కాన్వే, పతీరణ సేవలను కోల్పోవడం నిరాశపరిచే అంశం. మాకు రచిన్, డారిల్ మిచెల్ ఉన్నారు. వారి స్థానాలను వీరు భర్తీ చేయగలరు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మిచెల్, రచిన్, ముస్తాఫిజుర్, తీక్షణ ఓవర్‌సీస్ ప్లేయర్లుగా బరిలోకి దిగుతున్నారు. దేశవాళీ క్రికెటర్ సమీర్ రిజ్వీ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. ఫిట్‌నెస్ సమస్యలు, టీమ్ కాంబినేషన్ నేపథ్యంలోనే శార్దూల్ ఠాకూర్ తీసుకోలేదని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
తుది జట్లు:
ఆర్‌సీబీ
ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్, మయాంక్ దగర్,అల్జారీ జోసెఫ్, మహమ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్‌పాండే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications