ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మా ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. 10 జట్లు తమ తొలి మ్యాచ్‌లు ఆడటంతో మాకు కావాల్సిన విశ్రాంతి లభించింది. మా మ్యాచ్‌ల మధ్య మాకు కావాల్సిన విశ్రాంతి లభించనుంది.

ముంబై జట్టుపై మా బౌలర్లు పుంజుకున్న తీరు మా జట్టు స్వభావాన్ని తెలియజేస్తోంది. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. గత మ్యాచ్ మాదిరే పిచ్ కఠినంగా ఉండనుందని చెప్పాడు. 'ఆర్‌సీబీతో గత మ్యాచ్‌లో మేం శుభారంభం అందుకోకపోయినా.. అద్భుతంగా పుంజుకున్నాం. మ్యాచ్ అసాంతం జట్టులోని ప్రతీ ఒక్కరు సరైన ఇంటెంట్ కనబర్చారు. మా మలింగా జట్టులోకి వచ్చాడు. తీక్షణ స్థానంలో పతీరణను తీసుకున్నాం.'అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
తుది జట్లు
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజర్ రెహ్మాన్
గుజరాత్ టైటాన్స్: వద్ధిమాన్ సాహా(కీపర్), శుభ్‌మన్ గిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, గుజరాత్ టైటాన్స్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్