For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: ఇదెక్కడి పిచ్చిరా అయ్యా.. కోహ్లీ‌ని అధిగమించాడని తిడుతారా..?

ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపుతున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో ఇప్పటికే 509 పరుగులు చేసిన అతను ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లతో 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ(500)ని వెనక్కినెట్టి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ 53 పరుగులు చేసేవరకు విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగాడు. అతన్ని వెనక్కినెట్టి రుతురాజ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 63.62 యావరేజ్ 146.68 స్ట్రైక్‌రేట్‌తో 509 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 71.42 సగటు 147.49 స్ట్రైక్‌రేట్‌తో 500 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

IPL 2024 Ruturaj Gaikwad faces online abuse after surpassing Virat Kohli in Orange Cap race

అయితే కోహ్లీని అధిగమించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్‌పై సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు బండ బూతులు తిడుతున్నారు. తమ అభిమాన ఆటగాడైన కోహ్లీనే అధిగమిస్తావా? అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతని పోస్ట్‌ల కింద కామెంట్ సెక్షన్‌లో బండబూతులు తిడుతున్నారు. ఫిక్సర్, మా**చో* అంటూ రాయలేని పదాలతో కామెంట్ చేస్తున్నారు.

ఈ కామెంట్స్‌ను చూసిన ఫ్యాన్స్.. 'ఇదెక్కడి పిచ్చిరా అయ్యా.. కోహ్లీ‌ని అధిగమించాడని తిడుతారా..? 'అంటూ మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ పరువు తీయకండని సూచిస్తున్నారు.

ఐపీఎల్ చరిత్రలో 500+ స్కోరు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయిదు టైటిళ్లు గెలిచిన ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్ జట్టు పగ్గాలను అందుకున్నాడు. అంచనాలను అందుకుంటూ కెప్టెన్‌, బ్యాటర్‌గా నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు. కాగా, ఈ సీజన్ ఫస్ట్ హాఫ్‌లో సత్తాచాటిన సీఎస్‌కే సెకండ్ హాఫ్‌లో తడబడుతోంది.

Story first published: Thursday, May 2, 2024, 16:52 [IST]
Other articles published on May 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+