'ఈ సాల కప్ నమదే' (ఈసారి కప్ మాదే).. ప్రతి ఐపీఎల్ సీజన్‌కు ముందు, లీగ్ సమయంలోనూ రాయల్ చాలెంజర్స్బెంగళూరు (ఆర్‌సీబీ) నినాదం ఇది. కానీ పుష్కర కాలమైంది.. అయినా ఆర్‌సీబీ కప్ కొట్టలే..! వరల్డ్ సూపర్ స్టార్లు ఉన్నా.. టాప్ మోస్ట్ స్కిల్డ్ ప్లేయర్లను ప్రయత్నించినా.. ప్రతి ఏడాది ఎక్కడో తేడో కొడుతూనే ఉంది.
ముచ్చటగా మూడుసార్లు ఫైనల్‌కు చేరినా.. టైటిల్ ఒడిసిపట్టుకోలేని దురదృష్టం ఆర్‌సీబీ ఫ్రాంచైజీది..! కెప్టెన్‌ను మార్చినా.. కోచింగ్ స్టాఫ్‌తో పాటు జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసినా ఆర్‌సీబీ రాత మాత్రం మారలేదు. గత మూడు సీజన్లుగా మెరుగైన ప్రదర్శనతో ఊరించినా.. చివరకు అసలు సిసలు పోరులో తడబడి ఊసురుమనిపించింది.

ఇక గతాన్ని వదిలేస్తే.. కనీసం ఇప్పుడైనా ఆర్‌సీబీ తలరాత మారుతుందా..? అందని ద్రాక్షగా మిగిలిపోతున్న ఐపీఎల్ టైటిల్‌ను కింగ్ కోహ్లీ ముద్దాడుతాడా? 16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న బెంగళూరు అభిమానుల కల నేరవేరుతుందా? అంటే అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి. గతేడాది కంటే ఆర్‌సీబీ మరీ బలహీనంగా కనిపిస్తోంది.
ఆర్‌సీబీ బలాలు..:
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్‌లతో పాటు కొత్తగా వచ్చిన కామెరూన్ గ్రీన్‌లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. పైగా ఈ ఐదుగురు బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వారు అదే జోరును కొనసాగిస్తే ఆర్‌సీబీ సునాయసంగా భారీ స్కోర్లు చేస్తోంది.
ఆర్‌సీబీ బలహీనతలు..:
ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగం మినహా.. మిగతా అన్ని విషయాల్లోనూ బలహీనంగానే కనిపిస్తోంది. హజెల్ వుడ్, హర్షల్ పటేల్, హసరంగాలతో గతేడాది పటిష్టంగా కనిపించిన ఆర్‌సీబీ.. ఈ సీజన్‌కు ముందు వారిని వదిలేసింది. వారి స్థానాలను మాత్రం సరైన ఆటగాళ్లతో భర్తీ చేయలేకపోయింది. జోసెఫ్, యశ్ ధయాల్, లాకీ ఫెర్గూసన్ వంటి ఔట్‌రేటేడ్ బౌలర్లను తీసుకుంది.
గత సీజన్‌లో జోసెఫ్ యశ్ దయాల్ గుజరాత్ టైటాన్స్ తరఫున దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన ఫెర్గూసన్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. మహమ్మద్ సిరాజ్‌పై నమ్మకం పెట్టుకోలేని స్థితి. రీస్ టోప్లీ ఉన్నా.. అతను గాయాలతో బాధపడుతున్నాడు.
స్పిన్ విభాగంలో చెప్పుకోదగ్గ బౌలర్ ఒక్కడు కూడా లేడు. కర్ణ్ శర్మ, మయాంక్ దగర్, హిమాన్షు శర్మ, స్వప్నిల్ సింగ్ వంటి దేశీయ ఆటగాళ్లు ఉన్నా.. వారు ఇప్పటి వరకు తమ మార్క్ పెర్ఫామెన్స్ ఇవ్వలేదు. వికెట్ కీపర్లు దినేశ్ కార్తీ, అనూజ్ రావత్‌లు సైతం పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. కేవలం బ్యాటర్లపై ఆర్‌సీబీ పూర్తిగా ఆధారపడి ఉంది.

ఆర్‌సీబీ పూర్తి జట్టు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లేన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్, అల్జారి జోసెఫ్ (రూ. 11.50 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు), ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు), టామ్ కరన్ (రూ. 1.50 కోట్లు), సౌరభ్ చౌహాన్ (రూ. 20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు)
ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా):
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, మయాంక్ దగార్/సుయాష్ ప్రభుదేశాయ్, అల్జారీ జోసెఫ్/రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్/ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ