For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: రూ. 11.50 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్! ఆర్‌సీబీ తుది జట్టులో ఆడే ఓవర్‌సీస్ ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్ 2024 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సిద్దమవుతోంది. గత 17 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఆ జట్టు ఈ సారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటోంది. ఇప్పటికే బెంగళూరు వేదికగా ప్రీ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించిన ఆర్‌సీబీ.. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో సమాయత్తం అవుతోంది.

అప్‌కమింగ్ సీజన్ కోసం జట్టులో చాలా మార్పులు చేసిన ఆర్‌సీబీ.. తమ హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్, జట్టులోని ఆటగాళ్లను మార్చింది. హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ను నియమించింది. సపోర్ట్ స్టాఫ్‌లోనూ కీలక మార్పులు చేసింది. అయితే ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. వేలానికి ముందే ముంబై ఇండియన్స్‌ నుంచి రూ. 17.5 కోట్ల భారీ ధరకు కామెరూన్ గ్రీన్‌ను కొనుగోలు చేసింది.

IPL 2024 Royal Challengers Bangalore 4 Overseas Players Who Will Play All Matches

క్యాష్ డీల్ ట్రేడ్ ద్వారా అతన్ని జట్టులోకి తెచ్చుకుంది. మెజార్టీ డబ్బులు గ్రీన్‌కే వెళ్లిపోవడంతో వేలంలో కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది. హజెల్ వుడ్‌కు సరైన రిప్లేస్ మెంట్ తీసుకోలేదు. గత్యంతరం లేక అల్జారీ జోసెఫ్‌ను రూ. 11.5 కోట్లకు తీసుకుంది. బ్యాకప్ బౌలర్లుగా ఫెర్గూసన్, టామ్ కరన్‌లను కొనుగోలు చేసింది.

కెప్టెన్‌తో పాటు కీలక ఆటగాళ్లంతా విదేశీ ప్లేయర్లే కావడంతో తుది జట్టులో ఆడే ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఎవరా? అనేది ఆసక్తికరంగా మారింది.
విధ్వంసకర ఆల్‌రౌండర్‌గా మ్యాడ్ మ్యాక్సీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆడటం ఖాయం. ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న కామెరూన్ గ్రీన్ ఆడటంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

మిడిలార్డర్‌లో సత్తా చాటగలడని అతనిపై ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ విశ్వాసం పెంచుకుంది. నాలుగో ఓవర్‌సీస్ ప్లేయర్‌గా.. పేసర్ రీస్ టోప్లీ ఆడే అవకాశం ఉంది. అతనికి ఫెర్గూసన్, విల్ జాక్స్ నుంచి పోటీ నెలకొంది. రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అల్జారీ జోసెఫ్ బెంచ్‌కే పరిమతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా):
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, మయాంక్ దగార్/సుయాష్ ప్రభుదేశాయ్, అల్జారీ జోసెఫ్/రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్/ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ

ఆర్‌సీబీ పూర్తి జట్టు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లేన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్, అల్జారి జోసెఫ్‌ (రూ. 11.50 కోట్లు), యశ్‌ దయాల్‌ (రూ. 5 కోట్లు), ఫెర్గూసన్‌ (రూ. 2 కోట్లు), టామ్‌ కరన్‌ (రూ. 1.50 కోట్లు), సౌరభ్‌ చౌహాన్‌ (రూ. 20 లక్షలు), స్వప్నిల్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు)

Story first published: Wednesday, March 13, 2024, 14:54 [IST]
Other articles published on Mar 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+