For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్‌ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ (వీడియో)

డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ థీమ్ సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆ పాట ఇప్పటికీ గుర్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్, టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్ టీమ్స్ థీమ్ సాంగ్స్ ఏంటో కూడా తనకు తెలియదని, ఎన్ని థీమ్ సాంగ్స్ వచ్చినా.. డెక్కన్ ఛార్జర్స్ థీమ్ సాంగ్‌‌ను బీట్ చేయలేవన్నాడు.

ఐపీఎల్ ఆరంభంలో రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జెర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆడమ్ గిల్ క్రిస్ట్ సారథ్యంలో 2009 ఐపీఎల్ టైటిల్ సాధించాడు. ఆ సీజన్‌లో రోహిత్ శర్మ ఓ హ్యాట్రిక్ వికెట్ కూడా తీసాడు. 2010 వరకు ఆ జట్టు తరఫునే ఆడిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు.

IPL 2024 Rohit Sharma says Deccan Chargers team song best in IPL

తాజాగా డెక్కన్ ఛార్జర్స్ సారథి ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో రోహిత్ శర్మ ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గిల్ క్రిస్ట్ డెక్కన్ ఛార్జర్స్ టీమ్ థీమ్ సాంగ్‌ను ప్లే చేశాడు. 'గో ఛార్జర్స్, గో ఛార్జర్స్.. గో గో గో..'అనే ఈ పాట్‌ అప్పట్లో సెన్సేషన్‌. తాజాగా ఈ పాట విన్న రోహిత్.. ఈ థీమ్ సాంగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు.

'డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాట్ టీమ్ థీమ్ సాంగ్‌ నాకు చాలా ఇష్టం. ఆ పాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ టీమ్స్‌ థీమ్ సాంగ్స్ ఏవి కూడా డెక్కన్ ఛార్జర్స్ టీమ్ సాంగ్‌కు పోటీ రావు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం డెక్కన్ ఛార్జర్స్ టీమ్ థీమ్ సాంగ్‌లా మరే టీమ్ సాంగ్ వినలేదని, చాలా అద్భుతమైన పాట అని తెలిపాడు. కుర్రాళ్లతో కూడిన జట్టుకు ఈ పాటే ఉత్సాహం ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్‌పీ సింగ్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన డెక్కన్ ఛార్జర్స్ 2009 ఐపీఎల్ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ లీగ్ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో డెక్కన్ ఛార్జర్స్ టీమ్‌ను తొలగించగా.. హైదరాబాద్ ఫ్రాంచైజీ హక్కులను సన్ టీవీ నెట్‌వర్క్ కొనుగోలు చేసింది.

అప్పటి నుంచి డెక్కన్ ఛార్జర్స్‌కు బదులు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌లో కొనసాగుతోంది.

Story first published: Thursday, April 18, 2024, 16:54 [IST]
Other articles published on Apr 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+