Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ఫ్లయింగ్ కిస్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్‌ను ఆట పట్టించిన రోహిత్ శర్మ! (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆట పట్టించాడు. మయాంక్‌కు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ నవ్వులు పూయించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం ఉప్పల్ వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ప్రాక్టీస్ సందర్భంగా మయాంక్ అగర్వాల్‌ను కలిసిన రోహిత్ శర్మ.. ఫ్లయింగ్ కిస్‌తో అతన్ని ఆట పట్టించాడు. కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణాను ఇమిటేట్ చేస్తూ రోహిత్ నవ్వులు పూయించాడు. రోహిత్ శర్మ చమత్కారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

IPL 2024 Rohit Sharma having fun with Mayank Agarwal with flying kiss

సోషల్ మీడియాలో జరిగే ప్రతీ విషయంపై రోహిత్ అప్ డేట్ ఉంటాడని, హర్షిత్ రాణా ఎలా స్పందిస్తాడోనని కామెంట్ చేస్తున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను కట్టడిగా వేసిన హర్షిత్ రాణా.. కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

అయితే ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన తర్వాత హర్షిత్ రాణా హద్దుతు ధాటి ప్రవర్తించాడు. మయాంక్ అగర్వాల్‌కు ఫ్లయింగ్ కిస్‌ ఇస్తూ సంబరాలు చేసుకున్నాడు. హర్షిత్ రాణా సెలెబ్రేషన్స్‌ను పట్టించుకోకుండా మయాంక్ అగర్వాల్ పెవిలియన్ చేరాడు. అయితే ఈ చర్యను తప్పుబట్టిన ఐపీఎల్ నిర్వాహకులు హర్షిత్ రాణా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు.

అభిమానులు, మాజీ క్రికెటర్లు కూడా హర్షిత్ రాణా ఓవరాక్షన్‌పై విమర్శలు గుప్పించారు. అతని జరిమానాను ఉద్దేశించి కాస్ట్‌లీ కిస్ అంటూ ట్రోల్ చేశారు. తాజాగా రోహిత్ శర్మ సైతం.. ఫ్లయింగ్ కిస్‌తో మయాంక్‌ను ఆటపట్టించి పరోక్షంగా హర్షిత్ రాణాను ట్రోల్ చేశాడు.

Story first published: Tuesday, March 26, 2024, 20:30 [IST]
Other articles published on Mar 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+