Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: రోహిత్ శర్మ బర్త్ డే స్పెషల్.. 1, 2, 3, 4

1, 2, 3, 4 ర్యాంకులు కాదు.. పుట్టిన రోజు సందర్భంగా గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, టీమిండియా సారథి రోహిత్ శర్మ చేసిన పరుగులు. కాకతాళీయమో ఏమో కానీ గత నాలుగేళ్లుగా బర్త్‌డే భాయ్ రోహిత్ శర్మ సీరియల్ డిజిట్స్ పరుగులతో తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిస్తున్నాడు.

నేటి(ఏప్రిల్ 30)తో రోహిత్ శర్మ 37వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ పుట్టిన రోజు నేపథ్యంలో అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హంగామా చేశారు. అతనికి సంబంధించిన రికార్డ్స్, కెరీర్ హైలైట్స్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు. రోహిత్ శర్మపై తమకు ఉన్న అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకున్నారు.

IPL 2024 Rohit Sharma Creates Bizarre Batting Trend On his Birthday

రితికా అసహనం..
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగుతాడని అంతా భావించారు. కానీ అతను 5 బంతుల్లో 4 పరుగులు చేసి మోహ్‌సిన్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చెలరేగుతాడనుకున్న బర్త్‌డే భాయ్ త్వరగా ఔటవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫ్యాన్సే కాదు.. అతని సతీమణి రితికా సజ్దే సైతం నిరుత్సాహపడింది. చాలా అసహనంగా కనిపించింది.

అయితే గత నాలుగు సీజన్లలో బర్త్‌డే సందర్భంగా రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గత నాలుగు బర్త్‌డే ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 1, 2, 3, 4 పరుగులు చేశాడు. ఆశ్చర్యపోయే విషయం ఏంటేంటే .. ఈ పరుగులన్నింటినీ 5 బంతుల్లోనే చేయడం గమనార్హం. ఐపీఎల్ 2014 సీజన్‌లో బర్త్‌డే సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 5 బంతుల్లో ఒక్క పరుగే చేశాడు.

5 బంతుల్లోనే..
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో 2, ఐపీఎల్ 2023 బర్త్ డే సందర్భంగా రాజస్థాన్ రాయల్స్‌తోనే జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో 3 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో5 బంతుల్లో నాలుగు పరుగులు చేశాడు.

ఈ స్కోర్ల సీక్వెన్స్‌పై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. వచ్చే ఏడాది 5 బంతుల్లో 5 పరుగులు చేస్తాడేమోనని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఇవీ ర్యాంకులు కాదు.. రోహిత్ బర్త్‌డే స్కోర్లు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, April 30, 2024, 22:51 [IST]
Other articles published on Apr 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+