IPL 2024: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై ఆ జట్టు మాజీ సారథి రోహిత్ శర్మ స్పందించాడు. జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవని తెలిపాడు. ఇదంతా జీవితంలో భాగమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది. సొంత అభిమానులే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ఐదు టైటిళ్లు గెలిచిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌తో పాటు మ్యాచ్‌ల సందర్భంగా హార్దిక్ పాండ్యాను గేలి చేశారు. టీమ్ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ స్పష్టత ఇచ్చినా.. ఈ విమర్శలు ఆగలేదు.

కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ సతీమణి రాధిక సజ్దేతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ రెండు గ్రూప్‌లుగా విడిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. మైదానంలో ఆటగాళ్ల చేష్టలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. రోహిత్ శర్మ మాత్రం ఈ నిర్ణయంపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.
తాజాగా టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపిక నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజిత్ అగార్కర్‌తో కలిసి పాల్గొన్న రోహిత్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై నోరు విప్పాడు.
'ఇదంతా జీవితంలో ఓ భాగం. మనం అనుకున్నవన్నీ జరగవు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ నాకో మంచి అనుభవం. నేను గతంలో కూడా చాలా మంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. ఇప్పుడు పాండ్యా సారథ్యంలో ఆడుతున్నాను. పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవడమే జీవితం. కెప్టెన్సీ ఉన్నా.. ఇతరుల సారథ్యంలో ఆడినా జట్టు కోసం చేయగలిగినంత చేస్తాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రోహిత్ శర్మ 10 ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ మాత్రం 10 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications