Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rishabh Pant: అందుకే కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టాం

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఈ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. భారీ స్కోర్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తాం. ఇక్కడికి ముందుగానే వచ్చి చాలా ప్రాక్టీస్ చేశాం. దాంతో ఇక్కడి పరిస్థితులపై మాకు మంచి అవగాహన వచ్చింది.

IPL 2024 Rishabh Pant reveals the reason why Kuldeep Yadav not playing vs CSK

కుల్దీప్ యాదవ్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. రికీ భుయ్ స్థానంలో పృథ్వీ షాను తీసుకున్నాం. గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ సైతం రీఎంట్రీ ఇచ్చాడు.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు తాము టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఇది చాలా ఫ్రెష్ పిచ్ అని తెలిపిన రుతురాజ్.. ఇక్కడి వికెట్‌ ఎలా ఉంటుందనే విషయంపై సరైన సమాచారం లేదన్నాడు. స్టేడియంలో సీఎస్‌కే అభిమానుల జోరు చూస్తుంటే.. హోమ్ గ్రౌండ్ అనే ఫీలింగ్ కలుగుతుందన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్, కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర , అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీష పతీరణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్

Story first published: Sunday, March 31, 2024, 19:32 [IST]
Other articles published on Mar 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+