IPL 2024: 6 బంతుల్లో 6 బౌండరీలు.. రిషభ్ పంత్ విధ్వంసం! (వీడియో)
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వైజాగ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ 6 బంతుల్లో 6 బౌండరీలు బాదాడు. వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్‌లో రిషభ్ పంత్ వరుసగా 4, 6, 6, 4, 4, 4 లతో 28 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ ఓవర్ తొలి బంతిని ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదిన పంత్.. రెండో బంతిని ఓవర్ వైడ్ లాంగాఫ్‌లో సిక్సర్ కొట్టాడు. మూడో బంతిని ఫ్లిక్ షాట్‌తో ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా సిక్సర్ బాదాడు. ఐదో బంతిని బ్యాక్ వార్డ్ పాయింట్ దిశగా బౌండరీ కొట్టిన పంత్.. ఐదో బంతిని లెగ్ సైడ్, చివరి బంతిని డీప్ బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా బౌండరీలు బాది 28 పరుగులు పిండుకున్నాడు.

ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రిషభ్ పంత్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఘోర రోడ్డు ప్రమాదంతో గతేడాదిన్నరగా ఆటకు దూరమైన పంత్.. ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడని, పాత పంత్ తరహాలో చెలరేగుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
అయితే వరుణ్ చక్రవర్తీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే రిషభ్ పంత్ భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది. సునీల్ నరైన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. అంగ్‌క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications