Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. కెప్టెన్ రిషభ్‌ పంత్‌పై నిషేధం!

ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్ట‌ుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఐపీఎల్ నిర్వాహకులు ఓ మ్యాచ్ నిషేధం విధించారు. లీగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దాంతో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోయి తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను మరో ప్లేయర్ నడిపించనున్నాడు. ఈ సీజన్‌లో పదే పదే స్లో ఓవర్ రేట్‌కు కారణమైన రిషభ్ పంత్.. చివరకు ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. గత మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2024 Rishabh Pant has been suspended for the match against RCB due to slow over-rate penalty

అయితే ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు స్లో ఓవర్‌ రేట్‌కు కారణమైంది. దాంతో ఐపీఎల్ నిర్వాహకులు రిషభ్ పంత్‌పై ఓ మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. 'ఐపీఎల్ రూల్స్‌ను అతిక్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్‌ పంత్‌పై జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించాం.

రాజస్థాన్ రాయల్స్‌తో గత మంగళవారం(మే 7) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్‌లో ఆ జట్టు స్లో ఓవర్‌ రేట్‌కు గురవ్వడం ఇది మూడో సారి. దాంతో అతని మ్యాచ్‌ ఫీజులో రూ. 30 లక్షలు కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్‌ ఆడకుండా నిషేధం విధించాం.

జట్టులోని మిగతా ఆటగాళ్లతో పాటు ఇంప్టాక్ ప్లేయర్‌కు కూడా రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులోని 50 శాతం ఏది తక్కువైతే దాన్ని జరిమానగా విధించాం. మ్యాచ్ రిఫరీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఢిల్లీ క్యాపిటల్స్ అప్పీల్ చేయగా.. బీసీసీఐ అంబుడ్స్‌మన్ సమీక్షించి మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని సమర్థించారు.'అని ఐపీఎల్ నిర్వాహకులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రసవత్తరంగా మారి పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ రిషభ్ పంత్ దూరమవ్వడం.. ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను భర్తీ చేసే ఆటగాడు ఆ జట్టులో ఎవరూ లేరు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది.

Story first published: Saturday, May 11, 2024, 15:47 [IST]
Other articles published on May 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+