ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సంచలనం రింకూ సింగ్ వైఫల్యం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అతను తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. 23, 5 నాటౌట్, 26, 9 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు.
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ తేలిపోయాడు. 14 బంతులాడి ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ వైఫల్యంతో టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాడు.

30 మంది ఆటగాళ్లతో..
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వెంటనే అగ్రరాజ్యం అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా విన్నింగ్ కాంబినేషన్‌ను ఎంపిక చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు 30 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.
ఈ 30 మంది ఆటగాళ్లు ఐపీఎల్ 2024లో ఎలా ఆడుతున్నారనేది పరిశీలించి ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆటపై సెలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
చెపాక్ పిచ్ తరహాలోనే..
టీ20 ప్రపంచకప్ జరిగే అమెరికా, వెస్టిండీస్ పిచ్‌లు.. చెన్నైలోని చెపాక్ వికెట్‌కు దగ్గరగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ పిచ్‌పై రింకూ సింగ్ ప్రదర్శన ఆధారంగా అతని ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవాలని సెలెక్టర్లు భావించారు. అందుకు తగ్గట్లుగానే రింకూ సింగ్‌కు కూడా ఈ మ్యాచ్‌లో ముందుగానే బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది.
కేకేఆర్ 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో 9వ ఓవర్‌లోనే రింకూ సింగ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. దాంతో సెలెక్టర్ల ధృష్టిని ఆకర్షించేందుకు రింకూ సింగ్‌కు సరైన అవకాశం లభించిందని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం అభిప్రాయపడ్డాడు. కానీ స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై రింకూ సింగ్ తేలిపోయాడు.
రింకూతో పాటు..
దాంతో భారత జట్టులో చోటు దక్కించుకునే బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రింకూ సింగ్‌తో పాటు రాహుల్ ద్రవిడ్, అగార్కర్ ఎంపిక చేసిన 30 మంది ఆటగాళ్లలో చాలా మంది ప్లేయర్లు విఫలమవుతున్నారు. యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లంతా ఐపీఎల్ 2024 సీజన్‌లో తడబడుతున్నారు. దాంతో ద్రవిడ్, అగార్కర్ గందరగోళానికి గురవుతున్నారు.