Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలా కోహ్లీ ఒక్కడే ఆడగలడు: రిలీ రొసౌ (వీడియో)

టీమిండియా స్టార్, ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా క్రికెటర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు రిలీ రోసౌ ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20 ఫార్మాట్‌లో ప్రతీ మ్యాచ్‌లో పరుగులు చేయాలంటే కుదురదని, అలా ఆడటం కోహ్లీ ఒక్కడికే సాధ్యమవుతుందని కొనియాడాడు.

ప్రతీ మ్యాచ్‌లో పరుగులు చేయాలంటే ప్రతీ క్రికెటర్ విరాట్ కోహ్లీ కావాలన్నాడు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలీ రోసౌ.. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

IPL 2024 Rilee Rossouw s says Unless You re Kohli Can t Score In Every T20 Match

'టీ20 ఫార్మాట్‌లో ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు చేయడం కష్టం. విరాట్ కోహ్లీ అయితే తప్ప అది అందరితో సాధ్యం కాదు. అతడైతేనే ప్రతీ మ్యాచ్‌తోనూ నిలకడగా పరుగులు చేయగలడు. టీ20 ఫార్మాట్‌లో ఓ ఆటగాడు ఇంపాక్ట్ చూపితే చాలు. నా దృష్టిలో 5 బంతులు ఆడి పది పరుగులు చేసినా జట్టుకు ప్రయోజనకరమే. నేను చాలా టీ20 లీగ్స్ ఆడాను. కానీ ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ మాత్రం విభిన్నం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 661 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

ఇక ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరులు తేడాతో గెలిస్తేనే మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్ చేరుతోంది. లేదంటే సీఎస్‌కే విధించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో పూర్తి చేయాలి. అయితే బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది.

Story first published: Thursday, May 16, 2024, 22:20 [IST]
Other articles published on May 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+