IPL 2024: రింకూ సింగ్ కొంపముంచిన బీసీసీఐ నయా రూల్!
ఐపీఎల్ 2024 నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్ తీసుకొస్తుంది. ఎవరైనా అనామక ప్లేయర్.. రెండు ఐపీఎల్ సీజన్ల మధ్య భారత్ తరఫున ఆడితే.. రెండో సీజన్‌లో అతని సాలరీ పెంచేలే నిబంధనను తీసుకొస్తోంది. ఈ రూల్ ప్రకారం ఓ ప్లేయర్ రూ. 20 లక్షల కనీస ధరకు ఆడి.. తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తే తదుపరి సీజన్‌లో అతని జీతం రూ. 50 లక్షలకు పెరగనుంది.
5-9 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తే రూ. 75 లక్షలు, 10 మ్యాచ్‌లు ఆడితే కోటీ రూపాయలు అయ్యేలా బీసీసీఐ రూల్స్ తీసుకొస్తుంది. ఈ రూల్ ప్రకారం ఐపీఎల్ సెన్సేషన్ రింకూ సింగ్ జీతం కోటీ రూపాయలు కావాలి. అతను ఇప్పటి వరకు భారత్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాతనే ఈ అవకాశాలను అందుకున్నాడు.

ఈ లెక్కన అప్‌కమింగ్ సీజన్‌లో కేకేఆర్ కోటీ రూపాయలు చెల్లించాలి. కానీ ఈ రూల్‌లోని ఓ లూప్ హోల్ అతనికి అన్యాయం చేస్తోంది. ఈ రూల్ ప్రకారం అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ జీతం రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటేనే ఇది వర్తిస్తోంది. కానీ రింకూ సింగ్ ఐపీఎల్ సాలరీ ప్రస్తుతం రూ. 55 లక్షలుగా ఉంది.
బీసీసీఐ రూల్స్‌లోని రూ. 50 లక్షల కంటే రూ. 5 లక్షలుగా ఎక్కువగా ఉంది. దాంతో అతని జీతం పెరిగే అవకాశం లేకుండా పోయింది. విచిత్రం ఏంటంటే.. ఐపీఎల్ 2023 సీజన్‌లో యశ్ దయాల్ బౌలింగ్‌లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్స్‌లు బాదాడు.
దాంతో అతన్ని గుజరాత్ టైటాన్స్ వదిలేయగా.. ఆర్‌సీబీ రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 5 సిక్స్‌లు బాది బ్యాటర్ జీతం రూ. 55 లక్షలు ఉంటే.. కొట్టించుకున్న బౌలర్ జీతం పది రేట్లు ఎక్కువ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఐపీఎల్ జీతం తక్కువగానే ఉన్నా.. కేకేఆర్ అతనికి లైఫ్ ఇచ్చిందని, గిఫ్ట్స్ రూపంలోనూ భారీ సొమ్మునే ఇచ్చి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు మాత్రం బీసీసీఐ రూల్స్ మరించి రింకూ సింగ్‌కు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం వచ్చే ఏడాది ఎలాగూ మెగా వేలం జరగనుందని, అప్పుడు రింకూ సింగ్ భారీ ధర పలికే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications