ఐపీఎల్ టైటిల్ కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మార్చి 23న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 2024 సీజన్ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందుగా 21 మ్యాచ్‌ల వివరాలను మాత్రమే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా 52 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ ఫస్టాఫ్ షెడ్యూల్‌లో ఆర్‌సీబీ మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడనుంది.

ఇందులో మూడు మ్యాచ్‌లు తమ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌లతో ఆర్‌సీబీ తలపడనుంది.
మ్యాచ్1: మార్చి 22, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్‌సీబీ, చెన్నై (రాత్రి 8 గంటలకు)
మ్యాచ్ 2: ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్, బెంగళూరు(రాత్రి 7.30 గంటలకు)
మ్యాచ్ 3: ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్, బెంగళూరు(రాత్రి 7.30 గంటలకు)
మ్యాచ్ 4: ఆర్‌సీబీ వర్సెస్ ఎల్‌ఎస్‌జీ, బెంగళూరు( మధ్యాహ్నం 3.30 గంటలకు)
మ్యాచ్ 5: ఆర్‌ఆర్ వర్సెస్ ఆర్‌సీబీ, జైపూర్ (రాత్రి 7.30 గంటలకు)
ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా):
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, మయాంక్ దగార్/సుయాష్ ప్రభుదేశాయ్, అల్జారీ జోసెఫ్/రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్/ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ
ఆర్‌సీబీ పూర్తి జట్టు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లేన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్, అల్జారి జోసెఫ్ (రూ. 11.50 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు), ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు), టామ్ కరన్ (రూ. 1.50 కోట్లు), సౌరభ్ చౌహాన్ (రూ. 20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు)