IPL 2024: ఆర్‌సీబీ సంచలన నిర్ణయం..!
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్‌కమింగ్ సీజన్‌కు మరో 9 రోజుల్లో తెరలేవనుండగా.. ఆర్‌సీబీ తమ పేరును మార్చుకోవాలని భావిస్తోందంట. గత 16 ఏళ్లుగా ఆ జట్టు టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఇప్పటికే టీమ్ లోగోతో పాటు కోచ్‌లను ఆటగాళ్లను మార్చినా..ఆశించిన ఫలితం దక్కలేదు.
ఈ క్రమంలోనే తమ పేరులో స్వల్ప మార్పు చేయాలని ఆర్‌సీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇంగ్లీష్ స్పెల్లింగ్‌ను మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం Royal Challeners Bangalore(RCB)గా రాస్తున్నారు. అయితే అప్‌కమింగ్ సీజన్‌లో Royal Challengers Bengaluru(RCB)మార్చనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఆర్‌సీబీ షేర్ చేసిన ఓ వీడియోలో ఈ విషయం స్పష్టమైంది. ఈ వీడియోలో శాండల్ వుడ్ స్టార్ యాక్టర్ రిషభ్ శెట్టి.. రాయల్, ఛాలెంజర్స్, బెంగళూరు(Bangalore)అని వేర్వేరుగా రాసిన మూడు దున్నల్లో ఒక దున్నను గెదుముతాడు.. ఆ దున్నపై Bangalore అని రాసి ఉంది. ఆ వెంటనే అర్ధమైందా? అని కన్నడలో ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
బెంగళూరు నగరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికటేతర ఫ్రాంచైజీలు కూడా తమ పేరులో Bangaloreకు బదులు Bengaluru అని రాస్తున్నాయి. మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న అన్‌బాక్స్ ఈవెంట్‌లో ఈ పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తలపడనుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీసీసీఐ.. 22 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే.. మిగతా మ్యాచ్‌ల వివరాలను ప్రకటించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications