For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ రికార్డ్ బద్దలు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్‌లో 150 సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా ఆర్‌సీబీ చరిత్రకెక్కింది. ఐపీఎలే కాకుండా ఓ టీ20 టోర్నీలోనే ఓ జట్టు 150 సిక్స్‌లు బాదడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఈ ఫీట్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొత్తం 16 సిక్స్‌లు బాది ఈ ఘనతను అందుకుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 146 సిక్స్‌లతో ఈ జాబితాలో టాప్‌లో ఉండగా.. ఆర్‌సీబీ అధిగమించింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ నాలుగేసి సిక్స్‌లు బాదగా.. ఫాఫ్ డూప్లెసిస్, కామెరూన్ గ్రీన్ మూడేసి సిక్సర్లు కొట్టారు.

RCB become first team

దినేశ్ కార్తీక్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ చెరొక సిక్సర్ బాదారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47), గ్లేన్ మ్యాక్స్‌వెల్(5 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16), ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

రజత్ పటీదార్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41), కామెరూన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషారా దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు.

అయితే ఈ మ్యాచ్‌లో 218 పరుగులు చేయడం ద్వారా ఆర్‌సీబీ అరుదైన ఘనతను అందుకుంది. ఓ సీజన్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ రన్స్ చేసిన జట్టుగా.. ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌తో సమంగా నిలిచింది.

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ‌తో పాటు కేకేఆర్ 6 సార్లు 200 ప్లస్ రన్స్ చేసింది. 2023 సీజన్‌‌లో ముంబై ఇండియన్స్ కూడా ఆరు సార్లు 200 ప్లస్ రన్స్ చేసింది.

Story first published: Saturday, May 18, 2024, 23:17 [IST]
Other articles published on May 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+