IPL 2024: బెడిసి కొట్టిన గంభీర్ వ్యూహం.. సీఎస్‌కే ఘన విజయం!
ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మరో విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత సొంతగడ్డపై సత్తా చాటింది. పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
బౌలింగ్‌లో జడేజా రఫ్ఫాడించగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు. దాంతో సీఎస్‌కేను ఓడించాలనే కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు బెడిసికొట్టాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(3/18), తుషార్ దేశ్‌పాండే(3/33) మూడేసి వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించగా.. తీక్షణ ఓ వికెట్ తీసాడు.
కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 3 ఫోర్లతో 34), సునీల్ నరైన్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), అంగ్‌క్రిష్ రఘువంశీ( 18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో9 ఫోర్లతో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డారిల్ మిచెల్(25), శివమ్ దూబే(28) మెరుపులు మెరిపించారు.
అప్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ(1 నాటౌట్)తో రుతురాజ్ గైక్వాడ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఫియర్‌లెస్ అటాకింగ్ గేమ్.. కట్టడైన బౌలింగ్‌తో గత మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో మాత్రం సమష్టిగా విఫలమైంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై కేకేఆర్ బిగ్ హిట్టర్స్ తేలిపోయారు. అనుకూల్ రాయ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపిస్తూ గంభీర్ చేసిన ప్రయోగం కూడా బెడిసికొట్టింది.
టర్నింగ్ ట్రాక్‌పై కేకేఆర్ స్పిన్నర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. స్పిన్నర్లలో సునీల్ నరైన్ ఒక్కడే ఒక్క వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications