Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 వేలం తర్వాత పటిష్టంగా పంజాబ్ కింగ్స్.. తుది జట్టు అంచనా ఇదే!

PBKS playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్) చరిత్రలో టైటిల్ గెలవని మూడు జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం పంజాబ్ కింగ్స్ ఆనవాయితీ..! అంచనాలే లేనప్పుడు ధీటుగా పోటీ ఇవ్వడం.. కీలక సమయంలో చేతులు ఎత్తేయడం పంజాబ్ నైజం.!

ఈ కారణంగానే గత 16 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ టైటిల్ గెలవలేకపోయింది. యువరాజ్‌‌ సింగ్‌‌, సంగక్కర, గిల్‌‌క్రిస్ట్‌‌ వంటి లెజెండ్స్‌‌ మొదలుకొని.. మ్యాక్స్‌‌వెల్‌‌, అశ్విన్‌‌, లోకేశ్‌‌ రాహుల్‌, శిఖర్ ధావన్‌ వంటి మేటి స్టార్ల వరకు ఎంతో మందిని కెప్టెన్లుగా ప్రయత్నించినా.. కొత్త కోచ్‌లను తెచ్చుకున్నా.. టీమ్‌‌ పేరు మార్చుకున్నా.. సీజన్లు గడుస్తున్నా పంజాబ్ కింగ్స్ రాత మాత్రం మారలేదు.

IPL 2024: Punjab Kings strongest playing 11 after Mini Auction

2014లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జార్జ్‌ బెయిలీ నాయకత్వ పటిమ, మ్యాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులతో ఫైనల్‌కు దూసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచిన పంజాబ్‌.. టైటిల్‌ మాత్రం అందుకోలేకపోయింది. ఆ ఒక్క సీజన్లో మినహాయిస్తే ఐపీఎల్‌పై పంజాబ్‌ ముద్ర ఏ మాత్రం కనిపించదు.

ఇప్పుడు కొత్త సీజన్‌కు ఆటగాళ్లను మార్చుకుని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దమైంది. ఈసారైనా పంజాబ్‌ పంజా విసురుతుందో లేదో చూడాలి.

వేలంలో ఎప్పటిలానే..
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఎప్పటిలానే పంజాబ్ దూకుడు కనబర్చింది. కావాల్సిన ఆటగాళ్లపై ముందు వెనుకా చూసుకోకుండా కోట్లు కుమ్మరించడం ఆ జట్టుకు ఉన్న చెడు అలవాటు. ఈ సారి కూడా హర్షల్ పటేల్(రూ.11.75 కోట్లు), రిలీ రోసౌ(8 కోట్లు), క్రిస్ వోక్స్(రూ. 4.20 కోట్లు)‌లకు భారీ ధర వెచ్చించి తీసుకుంది. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం పేపర్‌పై పంజాబ్ కింగ్స్ బలంగా కనిపిస్తోంది.

టీమ్ కాంబినేషన్...
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్‌లో ప్రభు సిమ్రాన్ సింగ్ ఆడనుండగా.. నాలోగో స్థానంలో లియామ్ లివింగ్ స్టోన్ బరిలోకి దిగుతాడు. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మ ఆడనుండగా.. పేసర్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ బరిలోకి దిగనున్నాడు. హర్షల్ పటేల్ కగిసో రబడా, అర్ష్ దీప్ సింగ్ పేస్ విభాగాన్ని నడిపించనుండగా.. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. పరిస్థితులకు తగ్గట్లు విదేశీ ఆటగాళ్ల విషయంలో మార్పులు జరగవచ్చు.

పంజాబ్ కింగ్స్ తుది జట్టు(అంచనా)

శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కరణ్, రిషి ధావన్/హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడా, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

పంజాబ్ కింగ్స్ పూర్తి జట్టు:
జానీ బెయిర్ స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మ, శిఖర్ ధావన్, హర్ప్రీత్ భాటియా, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, రిషి ధావన్, సామ్ కరణ్, సిందర్ రాజా, శివమ్ సింగ్, క్రిస్ వోక్స్, అషుతోష్ శర్మ, విశ్వనాథ్ సింగ్, తనయ్ త్యాగరాజన్, హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడా, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, విద్వత్ కావేరప్ప, ప్రిన్స్ చౌదరి.

Story first published: Saturday, January 13, 2024, 9:56 [IST]
Other articles published on Jan 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+