IPL 2024: రూ. 9 కోట్ల ఆటగాడికి షాకిచ్చిన పంజాబ్ కింగ్స్.. రిటైన్, రిలీజ్ ప్లేయర్ల లిస్ట్ ఇదే!
Punjab Kings Release list: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ సంచలన నిర్ణయాలు ఏం తీసుకోలేదు. తమ కోర్ టీమ్‌పై పూర్తి నమ్మకం ఉంచిన పంజాబ్ కింగ్స్ తమ ప్రధాన ఆటగాళ్లందర్నీ రిటైన్ చేసుకుంది. షారూఖ్ ఖాన్‌తో పాటు శ్రీలంకకు చెందిన భానుక రాజపక్సలను మాత్రం వదిలేసుకుంది. ఈ ఇద్దరి ఆటగాళ్లకు మించి పంజాబ్ కింగ్స్ ఎలాంటి సంచలనాకు తావివ్వలేదు.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన సామ్ కరణ్‌ను వదిలేస్తుందని ప్రచారం జరిగినా.. అతనిపై పంజాబ్ ఫ్రాంచైజీ పూర్తి భరోసా ఉంచింది. మరోసారి అతనికి అవకాశం కల్పించింది. శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, జితీశ్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ కరణ్, సికిందర్ రాజా, లివింగ్ స్టోన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడాలతో కూడిన ప్రధాన ఆటగాళ్లందర్నీ రిటైన్ చేసుకుంది.

పంజాబ్ కింగ్స్ వదులుకున్న ఆటగాళ్లలో షారుఖ్ ఖాన్ ఒక్కడే రూ. 9 కోట్ల భారీ ధర ఆటగాడు కాగా.. రాజ్ అంగ్ బావాను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో షారూఖ్ ఖాన్ దారుణంగా విఫలమవడంతో అతనికి గుడ్‌బై చెప్పింది.
పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్:
శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, జితేశ్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ భాటియా, అథర్వ టైడే, రిషి ధావన్, సామ్ కరణ్, సికిందర్ రాజా, లియమ్ లివింగ్ స్టోన్, గుర్నూర్ సింగ్ బ్రార్, శివమ్ సింగ్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, విద్వత్ కావేరప్ప, కగిసో రబడా, నాథన్ ఎల్లిస్.
పంజాబ్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్ల జాబితా
భానుక రాజపక్స(రూ. 50 లక్షలు), మోహిత్ రతీ, బల్తేజ్ ధండా, రాజ్ అంగ్ బావా(రూ. 2 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ. 9 కోట్లు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications