For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్!

పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా రికార్డుకెక్కింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఓడించింది. 261 పరుగుల భారీ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించారు.

IPL 2024 Punjab Kings creates World Record after highest T20 run-chase vs KKR

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరణ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) , శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.

టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగులు చేధించిన జట్లు:

262 - పంజాబ్ కింగ్స్ vs కేకేఆర్, ఐపీఎల్ 2024
259 - సౌతాఫ్రికా vs వెస్టిండీస్, సెంచూరియన్, 2023
253 - మిడిల్ సెక్స్ vs సర్రే, ది ఓవల్, T20 బ్లాస్ట్ 2023
244 - ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 2018
243 - బల్గేరియా vs సెర్బియా, సోఫియా, 2022
243 - ముల్తాన్ సుల్తాన్స్ vs పేషావర్ జాల్మీ, రావల్పిండి, పీఎస్‌ఎల్ 2023

IPL 2024 Punjab Kings creates World Record after highest T20 run-chase vs KKR

ఐపీఎల్‌లోనే అత్యధిక పరుగులు చేధించిన జట్టు:

262 - పంజాబ్ కింగ్స్ vs కేకేఆర్, కోల్‌కతా, 2024
224 - రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, షార్జా, 2020
224 - రాజస్థాన్ రాయల్స్ vs కేకేఆర్, కోల్‌కతా, 2024
219 - ముంబై ఇండియన్స్ vs సీఎస్‌కే, ఢిల్లీ, 2021

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్

42 - కేకేఆర్ vs పంజాబ్, కోల్‌కతా, ఐపీఎల్ 2024
38 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్, ఐపీఎల్ 2024
38 - ఆర్‌సీబీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు, ఐపీఎల్ 2024
37 - బాల్క్ లెజెండ్స్ v కాబుల్ జవాన్,షార్జా, ఏపీఎల్ 2018/19

Story first published: Saturday, April 27, 2024, 9:41 [IST]
Other articles published on Apr 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+