ఐపీఎల్ 2024 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సామ్ కరణ్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 63), లియామ్ లివింగ్‌స్టోన్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో అద్భుత విజయాన్ని అందుకుంది.
ఈ విజయం నేపథ్యంలో ఆ జట్టు కో-ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఈ సొట్ట బుగ్గల సుందరి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డగౌట్‌లో తన రియాక్షన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. పంజాబ్ ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు.. బౌండరీ బాదినప్పుడల్లా ఎగిరి గంతేసింది.

అరంగేట్ర ఐపీఎల్ సీజన్ నుంచి పంజాబ్ మ్యాచ్‌లకు హాజరవుతున్న ప్రీతీ జింటా చెక్కు చెదరని అందంతో కుర్రాళ్ల మనసులు దోచుకుంటుంది. తాజా మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయానంతరం సంతోషాన్ని తట్టుకోలేక ముద్దులతో ముంచెత్తింది. పంజాబ్ ఆటగాళ్ల వైపు ఫ్లయింగ్ కిస్స్‌లు ఇచ్చింది. తన ముద్దులతో ప్రేక్షకులను రెచ్చగొట్టింది. స్టేడియం అంతా తిరుగుతూ ఈ విజయానందాన్ని అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం ప్రీతీ జింటాకు సంబంధించిన రియాక్షన్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. హాఫ్ సెంచరీతో మ్యాచ్ గెలిపించిన సామ్ కరణ్‌ను ప్రీతి జింటా ముద్దులతో ముంచెత్తుతుందని, అతని బుగ్గలను కొరికేస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రీతి జింటా తెచ్చే హుషారే వేరని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్( 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), షై హోప్(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. డేవిడ్ వార్నర్(28), మిచెల్ మార్ష్(20), రిషభ్ పంత్(18), అక్షర్ పటేల్(21) పర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. రబడా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. సామ్ కరణ్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 63) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. లియామ్ లివింగ్‌స్టోన్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.