IPL 2024: బంతిని దొంగలించిన అభిమాని.. చితకబాదిన పోలీసులు!(వీడియో)
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. గత శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా బ్యాటర్ కొట్టిన బంతిని ఓ అభిమాని అత్యుత్సాహంతో దొంగలించే ప్రయత్నం చేశాడు. స్టాండ్స్‌లో పడిన బంతిని ఇవ్వకుండా ప్యాంట్ జేబులో వేసుకునే ప్రయత్నం చేశాడు.

కానీ అతని దొంగతనాన్ని కనిపెట్టిన పోలీసులు.. తమదైన శైలిలో బంతిని లాక్కొని చితకబాదారు. మైదానం బయటకు వెళ్లగొట్టారు. కేకేఆర్ జెర్సీ వేసుకున్న సదరు అభిమాని.. పోలీసులకు ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వారు వినిపించుకోలేదు. ఆట పటిద్దామనే అత్యుత్సాహంతో సదరు అభిమాని బంతిని దాచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించగా.. సమష్టిగా రాణించిన కేకేఆర్ 18 పరుగుల తేడాతో తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నితీష్ రాణా(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) దూకుడుగా ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. నువాన్ తుషారా,అన్షుల్ కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులే చేసి ఓటమిపాలైంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications