Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 Playoffs: ఢిల్లీ చేతిలో లక్నో ఓడితే పరిస్థితి ఏంటి..?

ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరుకోగా... ప్లే ఆఫ్స్ బెర్త్‌ల సమీకరణం ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ మ్యాచ్‌కు ప్లే ఆఫ్స్ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే కేకేఆర్ అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్‌ను దక్కించుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

నేడు జరిగే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫలితం కూడా ప్లే ఆఫ్స్ బెర్త్‌లపై ప్రభావం చూపనుంది. ఇరు జట్లు చెరో 12 పాయింట్లతో ఆరు, ఏడో స్థానాల్లో కొనసాగుతున్నాయి.

IPL 2024 Playoffs Which result will mean what in DC vs LSG match today

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇదే చివరి మ్యాచ్ కగా.. లక్నోకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధిస్తే 14 పాయింట్స్‌తో ఐదో స్థానానికి చేరుకోవచ్చు. అయితే నెట్ రన్‌రేట్ తక్కువ ఉండటంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. దాదాపు ఢిల్లీ కూడా ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నట్లే.

లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీతో పాటు ముంబై‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ గెలుపొందాలి. అప్పుడు 8 విజయాలతో టాప్-4లో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఢిల్లీ చేతిలో ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. దాదాపు టోర్నీ నుంచి తప్పుకునే పరిస్థితే. ముంబైతో గెలిచినా నెట్‌రన్ రేట్ కీలకం అవుతుంది. నెట్ రన్‌రేట్ ఎక్కువ ఉన్న జట్లకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతోంది.

లక్నో వరుసగా రెండు గెలిస్తే చెన్నై.. తమ ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీపై గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ జట్టుకు నిష్క్రమణ తప్పదు. నేటి మ్యాచ్ ఫలితం ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై కూడా ప్రభావం చూపుతోంది.

Story first published: Tuesday, May 14, 2024, 16:17 [IST]
Other articles published on May 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+