Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్.. డేంజర్ జోన్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కే!

ఐపీఎల్ 2024 సీజన్‌ ప్లే ఆఫ్స్‌కు సన్‌‌రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్‌తో ఉప్పల్ వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యింది. దాంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో 15 పాయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది.

పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తే టాప్-2లో నిలిచే అవకాశం ఉంది. అయితే కేకేఆర్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ పంజాబ్‌ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడినా ప్లే ఆఫ్స్ చేరుతోంది.

IPL 2024 Playoffs Scenario How SRH vs GT Match Washout Impacts RCB CSK LSG DC

సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రద్దవ్వడంతో ఆర్‌సీబీ, సీఎస్‌కే డేంజర్ జోన్‌లో నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. శనివారం బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌.. ఆర్‌సీబీ, సీఎస్‌కేకు నాకౌట్‌లాంటిది.

ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదా 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించాలి. అప్పుడే సీఎస్‌కే కంటే మెరుగైన రన్ రేట్ సాధిస్తోంది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆర్‌సీబీని ఓడించాలి. లేదా తక్కువ మార్జిన్‌తో ఓడిపోవాలి. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్ష సూచన ఉండటం ఆర్‌సీబీ అభిమానులను కలవరపెడుతోంది.

ఈ మ్యాచ్‌‌ను కూడా వరణుడు అడ్డుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆవిరవుతాయి. ఫస్టాఫ్ సీజన్‌లో దారుణంగా విఫలమైన ఆర్‌సీబీ.. సెకండాఫ్ సీజన్‌లో దుమ్మురేపింది. వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.

సీఎస్‌కే టాప్-2లో నిలవాలంటే ఆర్‌సీబీని ఓడించాలి. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి.

Story first published: Thursday, May 16, 2024, 22:50 [IST]
Other articles published on May 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+