For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024 Auction షార్ట్ లిస్ట్‌ను ప్రకటించిన బీసీసీఐ.. రేసులో 333 మంది ఆటగాళ్లు!

IPL 2024 Auction‌లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఈ మెగా వేలానికి మొత్తం 1166 మంది రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనలతో ఈ జాబితాను 333 మందికి కుదించింది. ఈ వివరాలను బీసీసీఐ సెక్రటరీ జైషా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకో-కోలా అరెనా‌లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుంది. షార్ట్ లిస్ట్ చేసిన 333 మందిలో 214 మంది భారత ఆటగాళ్లతో పాటు 119 ఓవర్‌సీస్ ప్లేయర్లు.. ఇద్దరు అసోసియేట్ ఆటగాళ్లున్నారు. 116 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా.. 215 మంది అనామక ఆటగాళ్లు. ఇక 10 ఫ్రాంచైజీల్లో మొత్తం 77 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 30 ఓవర్‌సీస్ స్లాట్స్ ఉన్నాయి.

IPL 2024 player auction list announced: 333 players to go under hammer in Dubai

రూ. 2 కోట్ల కనీస ధరతో 23 మంది ఆటగాళ్లు.. రూ. 1.5 కోట్ల బేస్ ప్రైజ్‌తో 13 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. ఈ మినీ వేలం డిసెంబర్ 19(మంగళవారం) మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమై 2.30 గంటలకు ముగియనుంది.

ఈ వేలంలో పది ఫ్రాంచైజీలు 77 మంది ఆటగాళ్ల కోసం రూ.262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ సారీ ఫ్రాంచైజీల పర్స్ మనీని రూ. 5 కోట్లు పెంచి మొత్తం రూ. 100 కోట్లు చేసారు. ప్రస్తుతం పర్స్ మనీలో అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ దగ్గర రూ.38.15 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.5 కోట్లు ఉన్నాయి.

ఫ్రాంచైజీల వారీగా అందుబాటులో ఉన్న పర్స్ వాల్యూ

1. చెన్నై సూపర్ కింగ్స్-రూ. 31.4 కోట్లు
2. ఢిల్లీ క్యాపిటల్స్ -రూ.28.95 కోట్లు
3. గుజరాత్ టైటాన్స్ -రూ. 38.15 కోట్లు
4. కేకేఆర్ -రూ. 32.7 కోట్లు
5.ఎల్‌ఎస్‌జీ -రూ. 13.5 కోట్లు
6.ముంబై ఇండియన్స్ -రూ.17.75 కోట్లు
7. పంజాబ్ కింగ్స్ -రూ. 29.1 కోట్లు
8. ఆర్‌సీబీ -రూ.23.25 కోట్లు
9. రాజస్థాన్ రాయల్స్ -రూ. 14.5 కోట్లు
10. ఎస్‌ఆర్‌హెచ్ -రూ. 34 కోట్లు

Story first published: Monday, December 11, 2023, 22:02 [IST]
Other articles published on Dec 11, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+