For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సర్జరీ చేయిస్తానని ధోనీ మాట ఇచ్చాడు: మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని!(వీడియో)

శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న తనకు సర్జరీ చేయిస్తానని భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మాట ఇచ్చాడని అతని డైహార్డ్ ఫ్యాన్, ఐపీఎల్ 2024 సందర్భంగా మైదానంలోకి దూసుకెళ్లిన వ్యక్తి చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్‌‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సదరు అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు.

తన అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని కలిసి, అతని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సందర్భంగా ధోనీతో సదరు అభిమాని కాసేపు మాట్లాడాడు. ఆ సంభాషణకు సంబంధించిన వివరాలను తాజాగా ఆ అభిమాని మీడియాకు వెల్లడించాడు. తాను మాట్లాడుతుండగానే తన శ్వాసకోశ సమస్య‌ను ధోనీ గుర్తించాడని, సర్జరీ కూడా చేయిస్తానని చెప్పాడని తెలిపాడు.

IPL 2024 pitch invader says MS Dhoni said he would take care of my surgery

'నేను ధోనీని చూడగానే.. ఆయనకు లొంగిపోయే ప్రయత్నం చేశాను. నా రెండు చేతులను పైకెత్తి ధోనీని అందుకునే ప్రయత్నం చేశాను. ధోనీ భాయ్ మాత్రం..'నేను కాస్త ఫన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా'అని నాకు దూరంగా పరుగెత్తాడు.

ధోనీని చూడగానే నాకు పిచ్చెక్కిపోయింది. వెంటనే ఆయన కాళ్లు మొక్కాను. ధోనీ ఓ దిగ్గజం. ఆ క్షణం నా కళ్ల నుంచి నీరు వచ్చాయి. ధోనీ భాయ్ వెంటనే శ్వాస అంత గట్టిగా ఎందుకు తీసుకుంటున్నావ్? అని అడిగాడు. నేను ఫెన్సింగ్ దూకి మైదానంలో వేగంగా పరుగెత్తడంతో బాగా దమ్ము వచ్చింది. దాంతో ఎక్కువగా గాలి పీల్చుకునే ప్రయత్నం చేశాను.

దాంతో ధోనీ భాయ్ నా శ్వాస తీసుకోవడం గురించి ప్రశ్నించాడు. నా ముక్కులో సమస్య ఉందని ధోనీ భాయ్‌కి చెప్పాను. ఆయన వెంటనే.. నీకు సర్జరీ నేను చేయిస్తా. దిగులు చెందవద్దు. నీకు ఏమీ జరగనివ్వనని చెప్పాడు.'అని సదరు అభిమాని చెప్పుకొచ్చాడు.

సదరు అభిమానిని చూసిన వెంటనే ధోనీ వెనక్కి పరుగెత్తాడు. ఆ తర్వాత అతనిపై చేతులేసి మాట్లాడాడు. ఏమి అనవద్దని సెక్యూరిటీని కూడా ఆదేశించాడు. ఈ వీడియో అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ధోనీ బ్యాట్‌తో సత్తా చాటాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. అయితే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

42 ఏళ్ల వయసు గల ధోనీ వచ్చే సీజన్ ఆడుతాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తన ఐపీఎల్ రిటైర్మెంట్‌కు సంబంధించి ధోనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ సైతం ధోనీ రిటైర్మెంట్‌పై స్పష్టత లేదని చెప్పింది. తాము కూడా వచ్చే సీజన్ ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. అయితే వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోనీని రిటైన్ చేసుకుంటే సీఎస్‌కు నష్టం జరగనుంది. ఒక్క సీజన్‌ కోసం ధోనీని రిటైన్ చేసుకొని రిస్క్ చేస్తుందా? అనేది చూడాలి.

Story first published: Wednesday, May 29, 2024, 18:09 [IST]
Other articles published on May 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+