Pat Cummins: అతని వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడాం!
ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు దురదృష్టం తమ ఓటమిని శాసించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన కమిన్స్.. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా.. అదృష్టం కలిసిరాలేదన్నాడు.

'ఇది చాలా క్లోజ్ గేమ్. క్రికెట్‌లోనే అత్యద్భుతమైన మ్యాచ్. దురదృష్టవశాత్తు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. ఈ మ్యాచ్‌లో చాలా వరకు మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ రస్సెల్ తనదైన శైలిలో చెలరేగాడు.
రస్సెల్‌గా అతను ఏం చేయగలడో అదే చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో మేం మెరుగైన ప్రదర్శనే చేశాం. మా ప్రణాళికలను కట్టుదిట్టంగా అమలు చేసే ప్రయత్నం చేశాం. కానీ రస్సెల్ వంటి బ్యాటర్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతను కొన్ని అద్భుతమైన షాట్స్ ఆడాడు. మేం కూడా కొన్ని మెరుగైన బంతులు వేయాల్సింది.
రస్సెల్‌లా సెటిల్ అయిన బ్యాటర్‌కు బౌలింగ్ చేయడం క్రికెట్‌లోనే చాలా కష్టమైన పని. క్లాసెన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. షెహ్‌బాజ్ కూడా అతనికి సహకరించాడు. ఈ ఇద్దరూ మా జట్టును విజయం ముంగిట నిలబెట్టారు. దురదృష్టవశాత్తు మాకు విజయం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో మేం పుంజుకోవాల్సిన అన్ని దశల్లో మెరుగైన ప్రదర్శనే చేశాం.
అత్యుత్తమ జట్టు అయిన కేకేఆర్‌కు వారి సొంత మైదానంలో గట్టి పోటీనిచ్చాం. ఈ మ్యాచ్‌లో ఓడినా చాలా సానుకూలంశాలు లభించాయి. టాస్ గెలవడం కూడా కలిసొచ్చింది.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 8 సిక్స్‌లతో 63) కనబర్చిన అసాధారణ పోరాటం వృథా అయ్యింది. చివరి ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆండ్రూ రస్సెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగాడు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులే చేసి ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications