KKR vs SRH: ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. తనతో పాటు మార్కో జాన్సెన్, హెన్రీచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రమ్‌లు ఓవర్‌సీస్ ఆటగాళ్లుగా బరిలోకి దిగుతున్నారని చెప్పాడు.
టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు దక్కలేదన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తనకు ఇది తొలి మ్యాచ్ అని, ఈ జట్టులో చేరడం అద్భుతంగా ఉందని చెప్పాడు. జట్టులో ప్రతీ ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపాడు. ఓవర్‌సీస్ కోటాలో సన్‌రైజర్స్ ఇద్దరు బౌలర్లు, ఇద్దరు బ్యాటర్లను తీసుకుంది. దాంతోనే ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు దక్కలేదు. వాషింగ్టన్ సుందర్‌కు బదులు మాయంక్ మార్కెండ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. సుందర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే ఛాన్స్ ఉంది.

టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. పిచ్ కాస్త డ్రైగా ఉందని, ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అడ్వాంటేజ్ అవుతుందని చెప్పాడు. వెన్ను గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని చెప్పిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ కోసం తమ జట్టు బాగా సన్నదమైందని తెలిపాడు. తాను కూడా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడినట్లు చెప్పాడు.
గత కొన్ని సీజన్లుగా తమ జట్టు స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారని, ఈ సీజన్‌లో కూడా అదే జోరు కనబరుస్తారని ఆశిస్తున్నానని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, మిచెల్ స్టార్క్‌లు తమ ఓవర్‌సీస్ ఆటగాళ్లని చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్.
కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్, ఫిల్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, నితీష్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ.