For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs CSK: అందుకే మయాంక్ అగర్వాల్‌ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎలాంటి మార్పు లేకుండా మ్యాచ్ అసాంతం ఒకేలా ఉండనుంది. మాకు అద్భుతమైన జట్టు ఉంది. తుది జట్టులో ఒక మార్పు చేశాం. మయాంక్ అగర్వాల్ కాస్త అస్వస్థతకు గురయ్యాడు. అతని స్థానంలో నితీష్ రెడ్డిని తీసుకున్నాం.

IPL 2024 Pat Cummins Reveals The Reason Why Mayank Agarwal Not Playing vs CSK

జట్టుకు దూరమైన నటరాజన్ రీఎంట్రీ ఇచ్చాడు. గత మ్యాచ్‌లో ఇక్కడ 500 ప్లస్ రన్స్ నమోదయ్యాయి. కానీ ఈ మ్యాచ్‌లో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుంది.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు తమ జట్టులో మూడు మార్పులు చేశామని చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఫిట్‌నెస్ సమస్యలతో పతీరణ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పాడు. మోయిన్ అలీ, తీక్షణ, ముకేష్ చౌదరి జట్టులోకి వచ్చారని తెలిపాడు.

తుది జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మోయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, జయదేశ్ ఉనాద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్

Story first published: Friday, April 5, 2024, 19:39 [IST]
Other articles published on Apr 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+