Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. దేశభక్తి పాటలతో సందడి చేశాడు. మాతృఝే సలామ్ అంటూ తన గాత్రంతో అలరించాడు. మరో సింగర్ సోనూ నిగమ్ సైతం గూజ్ బంప్స్ వచ్చే పాటలతో సందడి చేశాడు.

అంతకుముందు బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ డ్యాన్స్‌తో అభిమానులను అలరించారు. ఈ ఆరంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

IPL 2024 Opening Ceremony Akshay Kumar AR Rahman Sonu Nigam are perform before the CSK vs RCB clash

ఐపీఎల్ 2024 సీజన్ ట్రోఫీని డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పట్టుకొచ్చాడు. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్టేజి పైకి రాగా అందరూ ట్రోఫీతో ఫొటోలకు ఫోజిచ్చారు. కళ్లు జిగేల్‌మనిపించే లైట్లు, లేజర్ షోలు, బాణాసంచా విన్యాసాలతో కిక్కిరిసిన చెపాక్ మైదానంలో ఐపీఎల్ 2024 సీజన్‌కు తెరలేచింది.

ఆరంభ వేడుకలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఏఆర్ రెహ్మాన్, సోనమ్ నిగమ్‌తో పాటు అక్షయ్ కుమార్‌ల ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుండగా.. టాస్ గెలిచిన ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

Story first published: Friday, March 22, 2024, 19:38 [IST]
Other articles published on Mar 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+