For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: అమ్మాయి డ్యాన్స్ వైరల్! (వీడియో)

క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా కొందరు అభిమానులు చేసే పనుల వల్ల సోషల్ మీడియాలో స్టార్లుగా మారుతుంటారు. గతంలో చాలా మంది ఇలా నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. తాజా సీజన్‌లో కూడా ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మనసును దోచేసింది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఈ మిస్టరీ గర్ల్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 36 బంతుల్లో 76 రన్స్ చేయాల్సిన సమయంలో ఆమెపై కెమెరామెన్ ఫోకస్ చేశారు.

IPL 2024 Mystery Girl danced video goes viral during RCB vs CSK match

దాంతో ఆ యువతి క్యూట్ స్టెప్పులతో అలరించారు. సదరు యువతి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందం, అభినయం అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇన్‌స్టా ఐడీ ఉంటే చెప్పండి బ్రేక్ ఇచ్చేద్దాం అని, మిచెల్ సాంట్నర్ ఔటయ్యేలా డ్యాన్స్ చేసిన ఆ యువతికి థ్యాంక్స్ అంటూ జోకులు పేల్చుతున్నారు.

ఈ మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీ 27 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోనీ, జడేజా చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47), గ్లేన్ మ్యాక్స్‌వెల్(5 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16), ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. రజత్ పటీదార్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41), కామెరూన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషారా దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓటమిపాలైంది. మరో 9 పరుగులు చేసుంటే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరేది.

రచిన్ రవీంద్ర(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), రవీంద్ర జడేజా(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్), ఎంఎస్ ధోనీ(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్(2/42) రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Monday, May 20, 2024, 15:17 [IST]
Other articles published on May 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+